Viral Video: మొబైల్ ఫోన్లకు కాపలాగా కప్పలు.. మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నాయేంటి.. షాకింగ్ వీడియో..
Viral Video: విలువైన వస్తువుల రక్షణ కోసం వాటిని లాకర్లలో, బీరువాలలో మరేదైనా రక్షణ వ్యవస్థలోనో భద్రపరుస్తాం.
Viral Video: విలువైన వస్తువుల రక్షణ కోసం వాటిని లాకర్లలో, బీరువాలలో మరేదైనా రక్షణ వ్యవస్థలోనో భద్రపరుస్తాం. ఇక సెల్ ఫోన్‌లో ఫైల్స్ అయితే, వాటికి పాస్‌వర్డ్స్, ఇతర ప్రోటెక్షన్ కోడ్స్ పెడతాం. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఫిక్షన్ సినిమాల్లో అయితే నిధులు, నిక్షేపాల చుట్టూ పెద్ద పెద్ద పాములు, వగైరా కాపలా ఉండటం చూసే ఉంటాం. దొంగలు, ముష్కరులు వాటిని దొంగిలించకుండా ఈ ప్రోటక్షన్ ఉంటుంది. అంతెందుకు.. తమిళనాడులోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నేలమాళిగల్లో దాచిన సంపదకు రక్షణగా సర్ప బంధనం ఉందని, పెద్ద పెద్ద నాగుపాములు ఆ నిధులను రక్షిస్తున్నాయనే ప్రచారమూ ఉంది.
సేమ్ టు సేమ్.. ప్రస్తుతం నెట్టింట్లో ఇలాంటి రక్షణ కవచానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు. ఈ వైరల్ వీడియోలో.. నాలుగు కప్పలు ఓ స్మార్ట్ ఫోన్‌కు కాపలాగా కూర్చున్నాయి. ఆ ఫోన్ ను ఎవరైనా తీసుకోవాలని ట్రై చేస్తే చాలు కస్సు మంటున్నాయి. కళ్లు పెద్దవి చేస్తూ పెద్ద శబ్ధాలతో కరిచేంత పని చేస్తున్నాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తి కప్పల మధ్య ఉన్న స్మార్ట్ ఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇక ఆ కప్పలు ఊరుకుంటేనా.. నాలుగు కప్పలు ఒకేసారి గుర్రుమన్నాయి. సదరు వ్యక్తిని ఆ స్మార్ట్‌ను టచ్ కూడా చేయనీయలేదు. టచ్ చేసేందుక ప్రయత్నిస్తే కరవబోయాయి. దెబ్బకు అతను తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
ఈ ఫన్నీ వీడియో @MorissaSchwartz అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు యూజర్. ఇంకేముంది.. ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అయ్యింది. వీడియోలో కప్పల కోపాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేంట్రా అయ్యా మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నాయని కంగారుపడిపోతున్నారు. బాడీగార్డుల కంటే కూడా డేంజర్‌గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. 26 సెకన్ల వ్యవధితో ఉన్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ సరదా వీడియోను మీరూ చూసేయండి.
They’re more serious than the Queen’s guards! pic.twitter.com/odvSmT3fFx
— Morissa (Dr. Rissy) Schwartz (@MorissaSchwartz) January 20, 2022
Viral Video:
Ganguly vs Kohli: భారత క్రికెట్లో ఏం జరుగుతుంది.. ఆ వివాదానికి ముగింపు పలకాల్సిందేనా..
German Navy Chief: జర్మన్ నేవీ చీఫ్ రాజీనామా.. ఉక్రెయిన్, రష్యాపై భారత్‌లో చేసిన వ్యాఖ్యలే కారణమా!
NEET PG Counselling 2021: NEET PG కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేయాలో తెలుసా..