Credit Card: క్రిడిట్ కార్డ్‌ను వాడుతున్నారా?.. అయితే ఈ తప్పులను అస్సలు చేయకండి..

Credit Card: క్రెడిట్ కార్డ్ అనేది ఉపయోగకరమైన ఆర్థిక సాధనం. డబ్బులు లేని సమయంలో కొనుగోళ్లు చేయడానికి

Credit Card: క్రిడిట్ కార్డ్‌ను వాడుతున్నారా?.. అయితే ఈ తప్పులను అస్సలు చేయకండి..
Follow us

|

Updated on: Jan 23, 2022 | 3:54 PM

Credit Card: క్రెడిట్ కార్డ్ అనేది ఉపయోగకరమైన ఆర్థిక సాధనం. డబ్బులు లేని సమయంలో కొనుగోళ్లు చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. అంతేకాదు.. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రివార్డ్‌లు, ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. క్రెడిట్ కార్డ్‌లను సరిగ్గా ఉపయోగించడం ద్వారా బలమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో లోన్‌కు సంబంధించి మంచి ఆఫర్‌లను పొందుతారు. అయితే, మీరు క్రెడిట్ కార్డులను నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఉపయోగిస్తే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..

కనీస మొత్తాన్ని చెల్లించండి.. కార్డ్ హోల్డర్‌లు తమ బకాయి ఉన్న బిల్లులో చిన్న భాగమైన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని మాత్రమే చెల్లించినప్పుడు, లేట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫైన్స్ కూడా ఏమీ ఉండవు. ఇది సాధారణంగా మీరు చెల్లించే మొత్తంలో 5 శాతం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ గనుక చెల్లించకపోతే.. అది కాస్తా కుప్పగా మారుతుంది. తుదకు ఫైన్స్ చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. ఎప్పటికప్పుడు బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని కార్డులకు ఇది 40 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు విత్‌డ్రా.. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు విత్ డ్రా చేస్తే రెండు రకాల ఛార్జీలు పడుతాయి. 3.5 శాతం వరకు నగదు అడ్వాన్స్ ఫీజులు, సంవత్సరానికి 23 నుంచి 49 శాతం వరకు ఫైనాన్స్ ఛార్జీలు పడుతాయి. ఈ ఛార్జీలు డబ్బు విత్‌డ్రా చేసుకున్న తేదీ నుంచి తిరిగి చెల్లించే వరకు వర్తిస్తాయి. కాబట్టి, మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు విత్ డ్రా చేసి, గడువు తేదీలోగా చెల్లించకపోతే భారీ ఛార్జీలను భరించాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని వినియోగించడం.. చాలా మంది క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ మొత్తాన్ని వాడేస్తుంటారు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయొచ్చు. కానీ, క్రెడిట్ బ్యూరోలు.. దీనిని ఎక్కువగా క్రెడిట్‌పై ఎక్కవగా ఆధారపడటటానికి సంకేతంగా భావిస్తాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఖర్చును మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో 60 శాతం వరకు వినియోగిస్తే సరిపొతుంది. అలా మీకు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

వడ్డీలేని ఈఎంఐలను ఎంచుకోండి.. క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపులను ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నట్లయితే.. వడ్డీ రహిత కాల వ్యవధిని ఎంపిక చేసుకోండి. ఈ కాల వ్యవధి సాధారణంగా 18 నుంచి 55 రోజుల మధ్య వ్యవధి ఉంటుంది. కొనుగోలును బట్టి వ్యవధి పెరుగొచ్చు. ఈ కాలంలో చేసే క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీ ఉండదు. ప్రయోజనాలను ఎక్కువగా పొందడానికి, వడ్డీ రహిత వ్యవధికి అనుగుణంగా మీ కొనుగోళ్లను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Also read:

Salary Overdraft: శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ అంటే ఏమిటో తెలుసా.. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే..

TTE Rules: రాత్రి రైలు ప్రయాణంలో టీటీఈ డిస్టర్బ్ చేయొద్దంటే ఇలా చేయండి..

Boat 181 TWS: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌.. త‌క్కువ ధ‌ర‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు..