- Telugu News Photo Gallery Technology photos Boat Recently launched Boat 181 Tws earphones have a look on features and price
Boat 181 TWS: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఇయర్ బడ్స్.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..
Boat 181 TWS: ఇయర్ బడ్స్ తయారీకి పేరు గాంచిన బోట్ సంస్థ తాజాగా మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడబ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇబయర్ బడ్స్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి...
Updated on: Jan 23, 2022 | 3:38 PM

ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ కంపెనీ బోట్ తాజాగా మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడబ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10mm డ్రైవర్స్, బ్లూటూత్ 5.2 అందించారు. వీటికి ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 20 గంటల వరకు ప్లేటైమ్ వస్తుంది.

ఇందులోని 10mm డ్రైవర్స్ సౌండ్ క్వాలిటీని మరింతగా పెంచుతుంది. అలాగే వీటిలో బాస్ సౌండ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో బయట ఉన్నా యూజర్లు స్పష్టతతో కూడిన సౌండ్‌ను వినొచ్చు.

ఇక ఛార్జింగ్‌కు కూడా ఇందులో ప్రాయరిటీ ఇచ్చారు. ఇందులో ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కారణంగా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 1.5 గంటల ప్లే బ్యాక్ పొందొచ్చు.

ప్రస్తుతం ఈ ఇయర్ బడ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఇయర్ బడ్స్ రూ. 1499కి అందుబాటులో ఉంది. ఇక బెస్ట్ కాలింగ్ కూడా ఇందులో మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.





























