Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (23-January-2022): ఈరోజులలో కూడా ఎక్కువమంది ఏ పని మొదలు పెట్టాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేయలన్నా.. తమ రోజును మొదలు పెట్టే ముందు లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించే ముందు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Today Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2022 | 6:17 PM

Horoscope Today (23-January-2022): ఈరోజులలో కూడా ఎక్కువమంది ఏ పని మొదలు పెట్టాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేయలన్నా.. తమ రోజును మొదలు పెట్టే ముందు లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఈరోజు ఎలా ఉంటుంది.. అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 23 వ తేదీ ) ఆదివారం (Sun day) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార రంగంలోని  వారు ఎటువంటి పనులు చేపట్టినా విజయాన్ని సొంతం చేసుకుంటారు. సమయం అన్ని విధాల అనుకూలంగా ఉంది. పరిస్థితికి తగిన విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. వివాదలా జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ  కాలం. సందర్భానుసారంగా ఆటంకాలు ఎదురుకాకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సలహాలు, సహాయం లభిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక విషయల్లో శ్రద్ధ పెట్టి చేయాల్సి ఉంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి తగిన సాయం అందుకుంటారు. అధిక  శ్రమ చేయాల్సి ఉంటుంది. విందు, వినోదకర్యక్రమాల్లో పాల్గొంటారు. పనులు ప్రారంభించే ముందు అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.  మంచి ఫలితాలను అందుకుంటారు.  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని విధాల మంచి కాలం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారి సహకారంతో అనకున్న పనులు పూర్తి చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఇష్టమైన వారితో గడుపుతారు. ముఖ్యమైన పనులను చేసే విషయంలో మొహమాటం విడిచి పెట్టాల్సి ఉంది. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. అనవసర విషయాల గురించి అధికంగా ఆలోచించకండి.  మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఈ రోజు అవసరానికి తగిన సాయం అందుకుంటారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న దానికంటే అధిక శ్రమపడాల్సి ఉంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అనవసర విషయాల మీద దృష్టి తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఊహించని ఫలితాలను అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఏకాగ్రత తో పనిచేస్తూ ముందుకు సాగడం మంచిది. అనుకున్నది సాధిస్తారు. ముఖ్య మైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు  తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు ప్రోత్సాహాన్ని అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Subhas Chandra Bose: నేతాజీ 125 వ జయంతి నేడు.. ఢిల్లీలో హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ