Vastu Tips For Money: సూర్యాస్తమయం తర్వాత మరిచిపోయి కూడా ఇలాంటి పనులు చేయకండి.. కారణం ఇదే..!

వాస్తు శాస్త్రంలో పేర్కొన్న చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అలాంటి పనులు సూర్యాస్తమయం తర్వాత చేస్తే శ్రీ మహా లక్ష్మికి కోపం వస్తుందని, భాగ్యలక్ష్మి మద్దతు ఉండకుండా పోతుందని చెబుతున్నారు.

Vastu Tips For Money: సూర్యాస్తమయం తర్వాత మరిచిపోయి కూడా ఇలాంటి పనులు చేయకండి.. కారణం ఇదే..!
Spirituality
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 04, 2023 | 8:03 AM

సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను పద్ధతిగా ఆచరిస్తుంటారు. అందులో భాగంగానే సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయరాదని చెబుతుంటారు. వాటికి కారణాలు తెలియకపోయినా పెద్దోళ్లు చెప్పారు కదా పాటిస్తుంటారు. ఇవి కేవలం వాళ్లు చాదస్తంతో చెప్పినవి మాత్రమే కాదు.. కొన్ని గ్రంధాల్లో ప్రస్తావించినవి. సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయడం వల్ల వ్యక్తికి దురదృష్టం కలుగుతుందని చెబుతారు. దీంతోపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అలాంటి పనులు సూర్యాస్తమయం తర్వాత చేస్తే శ్రీ మహా లక్ష్మికి కోపం వస్తుందని, భాగ్యలక్ష్మి మద్దతు ఉండకుండా పోతుందని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఏం చేయకూడదో తెలుసుకుందాం.

1. పసుపు దానం- వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత పసుపును ఎప్పుడూ దానం చేయకూడదని చెబుతారు. ఎందుకంటే సాధారణంగా పసుపును శుభ కార్యాలలో ఉపయోగిస్తారు. మరోవైపు, పసుపు నేరుగా బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే బృహస్పతి అభీష్టం పొంది ఇంట్లో ఆర్థిక పురోగతి నిలిచిపోతుందని చెబుతారు.

2. చీపురుతో చెత్త ఊడవటం- చీపురు లక్ష్మి స్వరూపం. విశ్వాసాల ప్రకారం, సాయంత్రం పూట ఇంట్లో చెత్తను శుభ్రం చేయకూడదని చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి అభీష్టం కలుగుతుందని చెబుతారు. ఇంట్లో చెత్తాచెదారం ఉంటే సూర్యాస్తమయం తర్వాత లక్ష్మిదేవి ఇంటికి రాదని చెబుతారు.

ఇవి కూడా చదవండి

3. సూర్యాస్తమయం తర్వాత దానం చేయవద్దు- నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాయంత్రం దానం చేయడం మానుకోవాలి. ముఖ్యంగా పాలు, పెరుగు, పసుపు, పంచదార వంటివి దానంగానీ, ఇతరులకు గానీ ఇవ్వకూడదని కూడా చెబుతారు. ఇది కూడా లక్ష్మిదేవికి కోపాన్ని కలిగిస్తుంది.

4. స్నానం చేయవద్దు- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయకూడదు. ఇది కూడా లక్ష్మిదేవికి కోపాన్ని తెప్పిస్తుంది. అంతే కాకుండా సాయంత్రం పూట స్నానం చేయడం, నుదుటిపై తిలకం పెట్టుకోవడం కూడా నిషేధం.

05. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకండి సంధ్యాసమయంలో నిద్రపోవడం వల్ల దేవతల ఆశీర్వచనాలు ఉండకపోగా రాక్షస బుద్ధి పెరుగుతుంది. ఈ సమయంలో నిద్ర ఆరోగ్యపరంగా కూడా చెడు ప్రభావం చూపిస్తుంది.

06. ఇంటిని చీకటిగా ఉంచొద్దు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం పెరుగుతుంది..అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుతో నిండి ఉంటే నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు. అందుకే సంధ్యాసమయంలో ఇంటిని అస్సలు చీకటిగా ఉంచకూడదు. కుదిరితే దేవుడి దగ్గర, ఇంటి ద్వారం దగ్గర ఈ సమయంలో దీపం వెలిగించడం శుభఫలితాలనిస్తుంది.

07. జుట్టు, గోళ్లు కత్తిరించ వద్దు చీకటి పడే సమయంలో జుట్టు, గోళ్లను ఎప్పుడూ కత్తిరించవద్దు. ఇది జీవితంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్మకం. దీనివల్ల  డబ్బు లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే