Viral video: గుడ్లను కాపాడుకునేందుకు పక్షి సాహసం.. రెక్కలు చాచి భారీ వాహనానికి అడ్డుగా.. హృదయం కరిగింది..

ఈ వీడియో సోషల్ మీడియాలో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. అమ్మ ధైర్యానికి యూజర్లు సెల్యూట్ చేస్తున్నారు. అదే సమయంలో,

Viral video: గుడ్లను కాపాడుకునేందుకు పక్షి సాహసం.. రెక్కలు చాచి భారీ వాహనానికి అడ్డుగా.. హృదయం కరిగింది..
Bird
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 03, 2023 | 1:09 PM

Viral video: తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తన ప్రేమను చాటేందుకు తల్లి ఏ స్థాయికైనా వెళ్తుంది. చివరకు తన ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది. అది మనుషుల్లోనే కాదు… మూగజీవాల్లోనూ అమ్మప్రేమ ఒకేలా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో… తన పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లి ప్రాణాలు అర్పిస్తుంది. తాజాగా అలాంటిదే ఓ పక్షికి సంబంధించిన సంఘటన సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తన గుడ్లను కాపాడుకోవటం కోసం తల్లి పడిన తపన చూసి.. నెటిజన్లుఇంప్రెస్ అవుతున్నారు. ఎంతటి సాహసం చేసిందో చూసి ఆశ్చర్యపోతున్నారు. పక్షితల్లి ప్రేమను తెగ మెచ్చుకుంటున్నారు. అదీ మాతృ హృదయం అంటే అని ప్రశంసలు కురిపిస్తున్నారు.. అసలు ఆ ఘటనలో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

ఇది పాత వీడియో అయినప్పటికీ సోషల్ మీడియాలో తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది. ఈ వీడియో వాలా అఫ్సర్ అనే ప్రొఫైల్‌లో ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో ఒక పక్షి తన గుడ్లను కాపాడుకోవడానికి ఒక పెద్ద యంత్రానికి ఎదురుగా వెళ్తుంది. అది నేలపై గుడుకట్టుకుని గుడ్లు పెట్టింది. కానీ, పొలంలో పని చేయడానికి పెద్ద యంత్రం ఒకటి పక్షి గూడు వైపుకు రావడం చూసింది. వాహనాన్ని గమనించిన పక్షి.. అక్కడి నుండి పారిపోవడానికి బదులు, ఆ వాహనానికి ఎదురుగా వెళ్లి తన రెక్కలతో గుడ్లను దాచిపెడుతుంది. తన ప్రాణాలను అడ్డువేసి మరీ ఆ గూడులో గుడ్లను కాపాడుకునేందుకు పక్షి ఆరాటం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

బుల్డోజర్‌ వంటి వాహనం పక్షి దగ్గరికి చేరుకోవడం వీడియోలో కనిపిస్తుంది.. ఆ పక్షి రెక్కలు విప్పి దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.. అందుకే ఆ తల్లి ధైర్యాన్ని చూసి ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి కరిగిపోయాడు. పక్షికి, దాని గుడ్లకు ఎలాంటి హాని కలగకుండా తన యంత్రాన్ని పైకి వాహనాన్ని ముందుకు కదిలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. అమ్మ ధైర్యానికి యూజర్లు సెల్యూట్ చేస్తున్నారు. అదే సమయంలో, పక్షుల గూడుకు హాని కలిగించకుండా చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్‌ను అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .