Trending Video: ఏం గుండె ధైర్యం అక్కా నీది.. అసలు ఇలా ఎవరైనా చేస్తారా.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో మీ కోసం..
సోషల్ మీడియా క్రేజ్ యూత్ లో విపరీతంగా పేరుకుపోయింది. లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. ప్రాణాల కంటే వ్యూస్ ఎక్కువ అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో తాము పోస్ట్...
సోషల్ మీడియా క్రేజ్ యూత్ లో విపరీతంగా పేరుకుపోయింది. లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. ప్రాణాల కంటే వ్యూస్ ఎక్కువ అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలకు లైక్స్, వ్యూస్ ఎన్ని వచ్చాయోనని చూసుకుంటున్నారు. ఆశించినంత రాకుంటే.. మనస్తాపానికి గురవుతున్నారు. వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడం, రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీలు దిగడం, డేంజర్ స్టంట్స్ చేస్తూ.. ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవలి జాంబియాలోని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటైన విక్టోరియా జలపాతం అంచుకు ఒక పర్యాటకుడు వెళ్లాడు. ఇది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో.. చూసేందుకు చాలా భయంకరంగా ఉంది. ఈ సాహసం చేయడానికి చాలా ధైర్యవంతులు కావాలి. ఈ క్లిప్ లో మాత్రం ఓ యువతి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో తేలుతుండటాన్ని చూడవచ్చు. అది కూడా జలపాతం అంచున. ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొ్డుస్తుంటే.. అక్కడున్న ఆమె అలా ఎలా చేయగలిగిందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో జాంబేజీ నది ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఔత్సాహిక పర్యాటకులు గజ ఈత గాళ్ల సహాయంతో డెవిల్స్ పూల్ దగ్గరకు వెళ్తుంటారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Just learned that standing this close to a 380 feet waterfall is a thing (Devil’s pool – Victoria falls ) pic.twitter.com/LwjOxoUrYF
— Weird and Terrifying (@weirdterrifying) December 30, 2022
డెవిల్స్ పూల్ అనేది జలపాతం అంచుకు దగ్గరగా సహజంగా ఏర్పడిన కొలను. ఆ ప్రాంతంలో ఈత కొట్టాలనుకునే వ్యక్తులు ఈ సాహసం చేయడానికి ముందుకొస్తుంటారు. డిసెంబర్ 30, 2022న ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. దీనికి ఇప్పటివరకు 66.8 మిలియన్ వ్యూస్య, 16.5వేల రీట్వీట్‌లు, 203.4 వేల లైక్స్ వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..