తిరుపతికి వెళ్లి ఈ నాలుగు తప్పులూ పొరపాటున కూడా చేయకండి ..! ఆ గోవిందుడి అనుగ్రహం పొందాలంటే..
కారణం ఏదైనా శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే ముఖ్యంగా పరమ పవిత్రమైన తిరుమలలో వేంకటేశ్వరుని కరుణ మీపై ఉండాలంటే ఈ నాలుగు తప్పులు చేయకండి. అప్పుడే ఆ కలియుగ దైవం కృపాకటాక్షాలు మీపై ఉంటాయని పండితులు అంటున్నారు.. ఆ నాలుగు దోషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కొంతమంది శ్రీవారి మీద భక్తితో దర్శనార్థం వస్తుంటారు. మరికొందరు తమ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు బాలాజీని దర్శించుకుంటారు. మరికొందరు గోవిందుడి దర్శనం కోసం వెళ్లి పరవశించిపోతారు… కారణం ఏదైనా శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే ముఖ్యంగా పరమ పవిత్రమైన తిరుమలలో వేంకటేశ్వరుని కరుణ మీపై ఉండాలంటే ఈ నాలుగు తప్పులు చేయకండి. అప్పుడే ఆ కలియుగ దైవం కృపాకటాక్షాలు మీపై ఉంటాయని పండితులు అంటున్నారు.. ఆ నాలుగు దోషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమల క్షేత్రంలో తొలిపూజ వరాహస్వామికి:
సాధారణంగా తిరుమలకు వెళ్లే చాలా మంది భక్తులు చేసే మొదటి తప్పు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లడమే. నిజానికి వరాహస్వామిని దర్శించకుండా శ్రీవేంకటేశ్వరుని దర్శించకూడదు అని చెబుతారు.. ఎందుకంటే తిరుమల వరాహస్వామికి చెందినది. అక్కడికి చేరుకున్న స్వామికి వరాహస్వామి స్థలం ఇచ్చి మూడు వాగ్దానాలు తీసుకున్నాడని అంటారు. అంతేకాదు.. తొలి పూజ, తొలి నైవేద్యం, తొలి దర్శనం నీకే ఇస్తానని శాసనం ఆ తిరుమల వెంకన్న ఓ సర్టిఫికేట్ కూడా రాసిచ్చాడని అంటారు. అందుకే అర్చకస్వామివారు వరాహస్వామికి తొలి పూజ, తొలి నైవేద్యాన్ని సమర్పిస్తారు. కానీ, చాలా మంది భక్తులు వరాహస్వామిని దర్శించుకోకుండా నేరుగా శ్రీనివాసుడిని దర్శించుకుంటారు.
ప్రాపంచిక సుఖాల కోసం తిరుమలకు వెళ్లవద్దు :
ప్రాపంచిక సుఖాల కోసం పరమ పవిత్రమైన తిరుమలకు వెళ్లకూడదు. అందుకే పెళ్లయిన ఆరు నెలల వరకు గుళ్లకు వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే పెళ్లయిన తర్వాత ఆ వ్యామోహం నుంచి బయటపడేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది. అందుకే ఈ నియమం పెట్టరట. ఇది భక్తులకే కాదు.. సాక్ష్యాత్తు ఆ వెంకటేశ్వరుడు కూడా పద్మావతిని వివాహమాడి కొండకింద ఉన్న అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు గడిపారట.
దొంగ దర్శనాలు పొందవద్దు :
తిరుమలలో చాలామంది చేసే మూడవ తప్పు దొంగ దర్శనాలు. దేవస్థానం నిర్దేశించిన నిబంధనలను గాలికి వదిలేస్తుంటారు. రకరకాల లేఖలు తీసుకొచ్చి నిర్వాహక మండలికి చూపిస్తారు. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు. ఎన్నిసార్లు, ఎంతసేపు దర్శనం చేసుకున్నామన్నది కాదు.. మనసు స్వచ్ఛంగా ఉందా లేదా అనేది ముఖ్యం.
తిరుమల వీధుల్లో చెప్పులు ధరించి నడవకూడదు :
రామానుజుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా తిరుమల వీధుల్లో చెప్పులు వేసుకుని నడవకండి. కొండంతా గ్రామమే. కొండ మొత్తం చెప్పులు లేకుండా నడవలేకపోయినా, కొన్ని వీధుల్లో చెప్పులు వేసుకోవద్దు. ఎందుకంటే కొండపై పండే ప్రతి పువ్వు భగవంతునికి అంకితం.. తొక్కడం సరికాదు కదా… ఈ తప్పులన్నీ చేయకుండా పుష్కరిణిలో స్నానం చేసి శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే సర్వం సిద్ధిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..