Varalakshmi Vratam: శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం.. భారీగా పాల్గొన్న మహిళలు.. పూజా సామగ్రి ఉచితంగా అందజేసిన దేవస్థానం
ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో సుమారు 15 వందల మంది మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజా సామగ్రిని ఉచితంగా అందజేససింది. అర్చకులు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పం నిర్విఘ్నంగా జరిపించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో రెండోవ శ్రావణ శుక్రవారాం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో సుమారు 15 వందల మంది మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజా సామగ్రిని ఉచితంగా అందజేససింది. అర్చకులు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పం నిర్విఘ్నంగా జరిపించారు.
అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక పూలు, గాజులు, ప్రసాదం అందజేసి శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అంతేకాదు ఈ వ్రతంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..