Viral Video: జాతీయ గీతం ఆలపిస్తున్న క్యూట్ కిడ్.. ప్రముఖులను ఆకట్టుకున్న వీడియో
వీడియాలో ఒక చిన్నారి బుడతడు ఈ జాతీయ గీతం ఆలపించిన తీరు.. అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా... వాస్తవానికి ఈ వీడియో స్కూల్ లో పరేడ్ జరిగిన సందర్భంలో తీసినట్లు తెలుస్తుంది. ఇంకా సరిగ్గా నిలబడడం రాని చిన్నారి బాలుడు .. ఇంకా చెప్పాలంటే మాటలు కూడా స్పష్టంగా మాట్లాడడం రాని ఓ చిన్నారి బాలుడు మనసులో నుంచి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా స్కూల్ లో జనగణమన గీతాన్ని అలపిస్తున్నాడు.
మన జాతీయ గీతం జనగణమన ఆలపిస్తుంటే చాలు ఏదో తెలియని ఆనందం.. మనసంతా దేశ భక్తితో నిండిపోతుంది. ఈ జాతీయ గీతాన్ని విద్యాసంస్థల్లో రోజూ అలపిస్తారు. అయితే గత కొంతకాలంగా సినిమా హాల్స్ లో సినిమా ప్రారంభానికి ముందు జనగణమన గీతాన్ని ఆలపిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ వీడియాలో ఒక చిన్నారి బుడతడు ఈ జాతీయ గీతం ఆలపించిన తీరు.. అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా… వాస్తవానికి ఈ వీడియో స్కూల్ లో పరేడ్ జరిగిన సందర్భంలో తీసినట్లు తెలుస్తుంది. ఇంకా సరిగ్గా నిలబడడం రాని చిన్నారి బాలుడు .. ఇంకా చెప్పాలంటే మాటలు కూడా స్పష్టంగా మాట్లాడడం రాని ఓ చిన్నారి బాలుడు మనసులో నుంచి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా స్కూల్ లో జనగణమన గీతాన్ని అలపిస్తున్నాడు. ఈ వీడియోను మొదట హర్ష్ గోయెంకా, ఆ తర్వాత కిరణ్ మజుందార్-షా 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న “అందమైన బాలుడు” వీడియోను షేర్ చేశారు . గోయెంకా ఈ వీడియోను షేర్ చేసినప్పుడు లక్ష మందికి పైగా వీక్షించారు. మజుందార్-షా పోస్ట్ కూడా క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు జాతీయ గీతం ఆలపిస్తున్నాడు. ఆ బుడతడికి జాతీయ గీతంలోని పదాలు స్పష్టంగా తెలియనట్లు అనిపిస్తోంది. అయితే ఆ బాలుడు జాతీయ గీతంలోని ప్రతి పదం పలకాలి అన్న తపన.. అతని తన ప్రదర్శనలో దేశభక్తి రుచిని అందరికి ఇంజెక్ట్ చేయడానికి పూర్తి ఉత్సాహంతో ఉన్నాడనిపిస్తుంది. అంతేకాదు ఆ గీతం ఆలపిస్తూ చివర జై హింద్ అన్న తీరు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో సిక్కింకు చెందినదిగా తెలుస్తోంది. మన జాతీయం ఆలపిస్తున్న ఈ బుడతడిని చూస్తే నవ్వకుండా ఉండడం అసాధ్యం అని హర్ష్ గోయెంకా ప్రశంసిస్తున్నారు. నిజమైన దేశ భక్తుడు.. భావి భారత పౌరుడు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు
There are countless renditions of our national anthem, but this one by a little one trying with all his heart really takes the cake. It’s impossible not to smile! 🇮🇳 pic.twitter.com/e0iQbyNiDu
— Harsh Goenka (@hvgoenka) August 15, 2024
“అతని హృదయం, శక్తి! అతను పాడే తీరు, ఎక్స్‌ప్రెషన్స్‌ని చూసి నవ్వడం ఆపుకోలేకపోతున్నాను.. టన్నుల కొద్దీ ప్రేమని అందిస్తున్నా.. దేవుడు ఆ బాలుడు ఆశీర్వదిస్తాడు! ” ఒకరు వ్రాస్తే, మరొకరు “జాతీయ గీతం నా అభిమాన వెర్షన్ చాలా అందంగా ఉంది” అని రాశారు. “మన దేశానికి ఇప్పుడు ఈ ప్యూర్ ఎనర్జీ డెస్పరేట్లీ నీడ్స్….నైస్ వన్!!!…..నిజాయితీగా సోషల్ మీడియాలో మీ కలెక్షన్స్ చూడటం ఇప్పుడు తనకు రోజువారీ అలవాటుగా మారింది,” అని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..