AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021: దీపావళికి ఈ 8 ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి..! అదృష్టం మీ వెంటే ఉంటుంది..

Diwali 2021: దీపావళి పండుగ కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడు, లక్ష్మిదేవిని పూజిస్తారు. ఈసారి దీపావళి నవంబర్ 4, గురువారం

Diwali 2021: దీపావళికి ఈ 8 ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి..! అదృష్టం మీ వెంటే ఉంటుంది..
Diwali
uppula Raju
|

Updated on: Nov 03, 2021 | 7:10 PM

Share

Diwali 2021: దీపావళి పండుగ కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడు, లక్ష్మిదేవిని పూజిస్తారు. ఈసారి దీపావళి నవంబర్ 4, గురువారం జరుపుకోనున్నారు. లక్ష్మిదేవి సంపద, వైభవానికి మూలం. లక్ష్మిదేవి నివసించే ఇంట్లో సంపద, ఆనందానికి లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ లక్ష్మిదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అంతేకాదు ఆమె రాక కోసం ఆరాధిస్తారు.

ఈ సందర్భంగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు. ప్రజలు తమ ఇంటిని పువ్వులు, దీపాలతో అలంకరిస్తారు. అంతే కాకుండా ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. ఈ విధంగా అమావాస్య రాత్రి కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది. దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.

1. దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి.

2. దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్‌లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. మీ ధాన్యాలు మొదలైనవి స్టోర్ హౌస్‌లో ఉంచుతారు. కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని దీని వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు.

3. ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటాడు. అందుకోసం దీపావళి రోజు రాత్రి మీ ఇంట్లోని డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి.

4. వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తారు. కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది.

5. నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి లేదా మరేదైనా నీటి వనరు ఉన్నచోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి.

6. ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి. గుడి లేకపోతే పూజగదిలో పడితే మంచిది. దీంతో లక్ష్మిదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి.

7. రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు. కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఆయనను ఆరాధించడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషిస్తుంది.

8. ఇంటి ఆవరణలో తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

Vitamin B12: మీ కాలి వేళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా..! అయితే విటమిన్ B12 లోపం.. చాలా డేంజర్‌..

T20 World Cup 2021: టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఓపెనర్.. మరో రికార్డులో కోహ్లీ సరసన కూడా..!