AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2024: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 9 గం. నుండి దర్శనాలు ప్రారంభం

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ 10 రోజులు కనక దుర్గాదేవి 10 అవతారలలో భక్తులకు దర్శనం ఇస్తారని వెల్లడించారు. ఇప్పటికే దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లేజర్ షో, కృష్ణమ్మ నదికి హారతి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా కనకడుర్గాదేవిని దర్శించుకునేందుకు 13 నుండి 15 లక్షలు మంది వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు.

Navaratri 2024: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 9 గం. నుండి దర్శనాలు ప్రారంభం
Indrakiladri Dasara Fest
Surya Kala
|

Updated on: Oct 02, 2024 | 6:54 PM

Share

దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాల సంబరాలు మొదలయ్యాయి. అమ్మవారి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ నేపధ్యంలో శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వ హించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. రేపటి నుంచి కనక దుర్గ ఆలయంలో దసరా నవరాత్రులు మొదలుకానున్నాయని ఆలయ ఈఓ రామారావు వెల్లడించారు. ఇప్పటికే దేవీ నవరాత్రి ఉత్సవాలకు సర్వత్రా సిద్ధం చేశామని అన్నారు. తనకు 2వ సారి ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలను నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన అమ్మవారికి, ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి వుంటానని చెప్పారు.

లేజర్ షో, కృష్ణమ్మ నది

దసరా అంటేనే అమ్మవారి అలంకారానికి ప్రతీతని చెప్పారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ 10 రోజులు కనక దుర్గాదేవి 10 అవతారలలో భక్తులకు దర్శనం ఇస్తారని వెల్లడించారు. ఇప్పటికే దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లేజర్ షో, కృష్ణమ్మ నదికి హారతి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా కనకడుర్గాదేవిని దర్శించుకునేందుకు 13 నుండి 15 లక్షలు మంది వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రులలో రెండో రోజు నుంచి అంటే అక్టోబర్ 4వ తేదీ తెల్లవారు జామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభం అవుతాయి. మహా నివేదన సమయం లో కాసేపు దర్శనాలు విరామం ఉంటుంది. ఖడ్గమాల ప్రత్యేక కుంకుమర్చనలు కూడా జరగనున్నాయని.. ప్రతిరోజూ 9 గంటలకు చండియాగం జరగనుందని తెలిపారు. అంతేకాదు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు పరోక్ష సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12 వ తేదీన తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ రోజు పూర్ణహుతి కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి

రేపటి నుండి అమ్మవారి అంతరాలయం దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.300, రూ. 500 దర్శనాలు టికెట్స్, ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు దర్శనం కోసం వచ్చే అన్ని క్యూ లైనుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకునే వీలుని కల్పిస్తున్నారు. ఇక దసరా సందర్భంగా దుర్గాదేవి దర్శనం కోసం వచ్చే ప్రముఖుల కోసం ప్రోటోకాల్ దర్శనం ఉదయం 8 నుండి 10 వరకు సమయాన్ని నిర్దేశించినట్లు తెలిపారు.

శివాలయం దగ్గర చైర్ లిఫ్ట్ ఏర్పాటు చేసామని.. బస్సులు అలాగే కార్ల ద్వారా భక్తులు రావొచ్చని తెలిపారు. సీతమ్మ పాదాల వద్ద కేశఖండన శాల ఏర్పాటు చేసినల్టు ఈఓ రామారావు చెప్పారు. ఇప్పటికే భక్తుల కోసం 150 మరుగు దొడ్లు విఎంసి సహాయం తో ఏర్పటు చేసామని తెలిపారు. అంతేకాదు ఆలయ పరిసర ప్రాంతాల్లో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు చేసామని చెప్పారు. భక్తులకు అందజేయడానికి 25 లక్షల లడ్డులు తయారీ చేస్తున్నామని తెలిపారు.

మీడియా వారికి కొండ పైనే ఫోడియం ఏర్పాటు చేసామన్నారు. లిఫ్ట్ మార్గాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఎగ్జిట్ మార్గలు నుంచి అమ్మవారి ఆలయంలోనికి రావడానికి అనుమతి లేదన్నారు. దర్శనం క్యూ లైన్లు, కట్టుదిట్టం గా బారిగేట్లు ఏర్పాటు చేసామని.. ప్రతి 30 మీటర్లకు ఒక అత్యవసర ఎగ్జిట్ ఏర్పాటు చేసామని చెప్పారు.

భక్తుల సౌకర్యం కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 17 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు. కనక ఆలయం సమాచారం కోసం ప్రత్యేక మైన ఒక యాప్ ని ఏర్పాటు చేసినట్లు.. భక్తులందరు ఈ సౌకర్యాలు వినియోగించుకోవాలి ఆలయ ఈవో రామారావు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..