Bihar Floods: ముజఫర్‌పూర్‌లో తప్పిన భారీ ప్రమాదం.. నీటిలో పడిన వాయుసేన హెలికాప్టర్.. సామగ్రిని దోచుకున్న గ్రామస్తులు

ప్రస్తుతం బీహార్ వరదల్లో చిక్కుకుంది. ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దాదాపు 16 లక్షల మంది వరదల బారిన పడ్డారు. వరద నీటి నుంచి ప్రజలను రక్షించడానికి, సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి పోలీసులతో పాటు, NDRF, SDRF, ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకున్నారు. బీహార్ వరద ప్రభావిత ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు చేరుకుని ప్రజలకు ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నాయి.

Bihar Floods: ముజఫర్‌పూర్‌లో తప్పిన భారీ ప్రమాదం.. నీటిలో పడిన వాయుసేన హెలికాప్టర్.. సామగ్రిని దోచుకున్న గ్రామస్తులు
Bihar Floods
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2024 | 4:28 PM

నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం బీహార్ పై చూపిస్తోంది. బీహార్‌లో అనేక జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అయితే తాజాగా వరదల మధ్య పెను ప్రమాదం సంభవించింది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ బుధవారం వరద నీటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఔరై నయా విలేజ్ వార్డు నంబర్ 13లో జరిగింది. హెలికాప్టర్ సీతామర్హి జిల్లా నుండి సహాయ సామగ్రిని పంపిణీ చేసి తిరిగి వస్తుండగా, ఔరై నయా గ్రామంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు, మరో ముగ్గురు వైమానిక దళ సిబ్బంది ఉండగా, వారందరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

ప్రస్తుతం బీహార్ వరదల్లో చిక్కుకుంది. ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దాదాపు 16 లక్షల మంది వరదల బారిన పడ్డారు. వరద నీటి నుంచి ప్రజలను రక్షించడానికి, సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి పోలీసులతో పాటు, NDRF, SDRF, ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకున్నారు. బీహార్ వరద ప్రభావిత ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు చేరుకుని ప్రజలకు ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నాయి.

రిలీఫ్ మెటీరియల్ పంపిణీ చేసి తిరిగి వస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్

బుధవారం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సీతామర్హి జిల్లాలో సహాయక సామగ్రిని పంపిణీ చేసి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ఏదో తేడా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్‌లు ఎమర్జెన్సి ల్యాండింగ్ చేయాలనీ కోరుకున్నారు. అయితే అన్ని చోట్లా నీరు ఉండడంతో పైలట్‌లు ఇద్దరూ దాన్ని నీటిలో దించాలని నిర్ణయించుకున్నారు. ముజఫర్‌పూర్ జిల్లా ఔరాయ్ బ్లాక్‌లోని ఘనశ్యాంపూర్ పంచాయతీ బేసి బజార్ సమీపంలో పైలట్ హెలికాప్టర్‌ను వరద నీటిలో దించాడు.

సైనికుల ప్రాణాలను కాపాడిన గ్రామస్తులు

తొలుత హెలికాప్టర్ నీటిలో పడిపోవడాన్ని స్థానికులు గమనించి.. వెంటనే అక్కడికి పరుగులు తీశారు. గ్రామస్థులు హెలికాప్టర్ దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత అందులో ఉన్న ఇద్దరు పైలట్లను, ముగ్గురు సైనికులను బయటకు తీశారు. హుటాహుటిన సైనికులను సురక్షిత ప్రదేశానికి చేర్చి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్ చుట్టూ ఉన్న నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సహాయక సామగ్రిని కొల్లగొట్టడం, వీడియో వైరల్‌గా మారింది

సహాయక సామగ్రిని హెలికాప్టర్‌లో ఉన్న విషయం గమనించిన గ్రామస్తులు సైనికులను తరలించిన తర్వాత వాటిని దోచుకోవడం ప్రారంభించారు. ప్రజలు తమ వెంట బస్తాలు తీసుకెళ్లారు. సహాయక సామగ్రిని కొల్లగొట్టిన అనేక వీడియోలు బయటపడ్డాయి. అందులో గ్రామస్తులు హెలికాప్టర్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. దానిలో ఉన్న సహాయక సామగ్రిని బయటకు తీస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..