Hanuman Birth Place: హనుమంతుడి జన్మస్థలం వివాదంపై బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు
Hanuman Birth Place:హిందువుల ఆరాధ్య దైవాల్లో ఒకరు.. రామాయణంలో అత్యంత విశిష్టత కలిగిన వ్యక్తి.. రామ భక్త హనుమాన్ జన్మ స్థలం విషయంలో గత కొంతకాలంగా వివాదం రేగుతున్న..
Hanuman BirthPlace:హిందువుల ఆరాధ్య దైవాల్లో ఒకరు.. రామాయణంలో అత్యంత విశిష్టత కలిగిన వ్యక్తి.. రామ భక్త హనుమాన్ జన్మ స్థలం విషయంలో గత కొంతకాలంగా వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఆంజనేయ స్వామి జన్మస్థలంపై హనుమంతుడు మావాడంటే మావాడు అంటూ.. ఓ వైపు టీటీడీ, మరోవైపు కిష్కింధ సంస్థాన్ ట్రస్టు మాటల యుద్ధం జరుగుతుంది.
ఇదే అంశంపై ఓ ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం స్పందించారు. హనుమంతుడి జన్మస్థల వివాదంపై తనదైన శైలిలో అభిప్రాయాన్ని వెల్లడించారు. భక్తికి నిదర్శనం ఆంజనేయ స్వామి అని అభివర్ణించారు. ఆంజనేయుడు ఎక్కడ పుట్టారని వివాదం చేయడం ఏమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పారు. ఆంజనేయుడు ఎక్కడ పుట్టారో అని వాదనలు చేసుకోవడం కంటే భారత దేశంలో పుట్టారని గర్వపడితే మంచిదని వ్యాఖ్యానించారు. ఆంజనేయుడు అందరివారని, దయచేసి వివాదాస్పదం చేయవద్దని బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు.
అంజనాద్రి తప ఫలంగా ఆంజనేయస్వామి జన్మించారని, తిరుమల కొండపైనే హనుమంతుడు జన్మించినట్లు టీటీడీ అధికార ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలంమని గోవిందస్వామి సరైన ఆధారాలు చూపించలేదు. ఎవరైనా బలమైన ఆధారాలు చూపిస్తే ఆలోచిస్తామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు
Also Read: మృత్యు భయాన్ని తొలగిస్తున్న కరోనా వ్యాక్సిన్.. టీకా పనితీరుపై ఎయిమ్స్ అధ్యయనం
తన యజమానులురాలు మరో పిల్లిని పిలుస్తుంటే.. అసూయతో ఈ పిల్లి చేసే పనులు చూస్తే నవ్వాపుకోలేరుగా