Viral Video:తన యజమానులురాలు మరో పిల్లిని పిలుస్తుంటే.. అసూయతో ఈ పిల్లి చేసే పనులు చూస్తే నవ్వాపుకోలేరుగా
Viral Video: తమకు నచ్చినవారు తననే చూడాలని.. తనతోనే ఉండాలి.. కోరుకుంటారు. అలా కాకుండా తమకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు... తనతో సమానంగా..

Viral Video: తమకు నచ్చినవారు తననే చూడాలని.. తనతోనే ఉండాలి.. కోరుకుంటారు. అలా కాకుండా తమకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు… తనతో సమానంగా ఇతరులను చూస్తే. అసూయ ఫీల్ అవుతారు.. అయితే ఈ విషయం లో జంతువులు కూడా మినహాయింపు కాదని తెలుస్తోంది. తమ యజమాని తననే ఎక్కువగా ప్రేమించాలని.. తనతోనే ఎక్కువ సేపు గడపాలని కోరుకుంటాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా పెంపుడు పిల్లల వీడియో లు హల్ చల్ చేస్తుంటాయి. పిల్లులు చేసే ముద్దుముద్దుపనులు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ పిల్లి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో పిల్లి అసూయను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది..
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఓ పిల్లి తన ఇతర పిల్లి పిల్లను తన యజమానురాలిని పిలవకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో కి ఆ పిల్లి యజమాని.. తాను ఇతర పిల్లులను పిలిచినప్పుడు నా పిల్లికి అసూయ వస్తుంది అనే క్యాప్షన్ జత చేసింది. ఆ వీడియో లో తనను కాకుండా వేరే పిల్లి పేరును పిలవకుండా ఆపడానికి పిల్లి తన యజమాని నోటిపై పదేపదే తన పాదాలను ఉంచడాన్ని చూపిస్తుంది. మీరు కూడా ఆ పిల్లి చేష్టలపైవు లుక్ వేయండి .. మనసారా నవ్వుకోండి.
View this post on Instagram
Also Read: మృత్యు భయాన్ని తొలగిస్తున్న కరోనా వ్యాక్సిన్.. టీకా పనితీరుపై ఎయిమ్స్ అధ్యయనం
: ఆడ నెమలిని ఆకట్టుకోవడానికి మగ నెమలి ప్రయత్నం.. పురివిప్పు నాట్యం.. వీడియో వైరల్
