AIIMs On Covid-19: మృత్యు భయాన్ని తొలగిస్తున్న కరోనా వ్యాక్సిన్.. టీకా పనితీరుపై ఎయిమ్స్ అధ్యయనం

AIIMs On Covid-19: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. అయితే తాజాగా వ్యాక్సినేషన్ అంశంపై ఆలిండియా...

AIIMs On Covid-19:  మృత్యు భయాన్ని తొలగిస్తున్న కరోనా వ్యాక్సిన్.. టీకా పనితీరుపై ఎయిమ్స్ అధ్యయనం
Moderna Vaccine
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2021 | 2:02 PM

AIIMs On Covid-19: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. అయితే తాజాగా వ్యాక్సినేషన్ అంశంపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధ్యయనం చేపట్టింది. వ్యాక్సిన్ల సామర్థ్యంపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంతృప్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వాళ్లలో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఎయిమ్స్ అధ్యయనం చెబుతోంది. వ్యాక్సిన్ తో కరోనా మృత్యుభయం ఉండదని గుర్తించారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారిలో తీవ్ర లక్షణాలు ఉండడంలేదని, విషమ పరిస్థితులు కనిపించడంలేదని ఎయిమ్స్ పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ పొందిన తర్వాత కరోనా సోకిన 63 మంది బాధితులపై ఈ అధ్యయనం చేపట్టారు. వారిలో 36 మంది రెండు డోసులు పొందగా, 27 మంది సింగిల్ డోస్ తీసుకున్నారు. అలాగే వారిలో 53 మంది కొవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ వేయించుకున్నారు. కాగా, వారికి కరోనా సోకినప్పుడు పరీక్ష చేయగా, వారి శాంపిళ్లలో వైరల్ లోడ్ ఎక్కువగానే కనిపించింది. వీరిలో వ్యాక్సిన్ తీసుకోని కరోనా రోగుల మాదిరే జ్వరం కూడాఐదు నుంచి ఏడు రోజుల పాటు కనిపించినప్పటికీ..ఆ లక్షణాలేవీ బాధితులను ఇబ్బంది పెట్టేంత స్థాయిలో లేవని గుర్తించారు.

Also Read: ఆడ నెమలిని ఆకట్టుకోవడానికి మగ నెమలి ప్రయత్నం.. పురివిప్పు నాట్యం.. వీడియో వైరల్

 చెట్టుకు ఉన్న ఒక్క‌ ఆకుతో సుంద‌ర‌మైన గూడు నిర్మించిన ప‌క్షి.. చూస్తే వావ్ అంటారు..