‘ఆయన ఫోటో ఎందుకు ..?’ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోటోలు

బెంగాల్ లో టీకామందులు తీసుకున్నవారికి జారీ చేస్తున్న సరిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోల బదులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోటోలు కనిపిస్తున్నాయి.

'ఆయన ఫోటో ఎందుకు ..?'  వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోటోలు
Bengal Govt.new Certificates With Cm Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 05, 2021 | 2:14 PM

బెంగాల్ లో టీకామందులు తీసుకున్నవారికి జారీ చేస్తున్న సరిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోల బదులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మోదీ ఫోటోలు ఉండగా వాటిని తొలగించాలని పాలక తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రులు, కోవిద్ సెంటర్లలో వ్యాక్సిన్ ఇస్తున్నవారికి ఈ కొత్త సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు.. అయితే 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికే వీటిని ప్రదానం చేస్తున్నారు. ఛత్తీస్ గడ్ తరువాత ఇలాంటి చర్య తీసుకున్న రెండో రాష్ట్రమైంది బెంగాల్…ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ సర్టిఫికెట్లపై మోదీ ఫోటోలు తొలగించి వాటి స్థానే సీఎం భూపేష్ బాఘేల్ ముఖచిత్రాన్ని ప్రచురిస్తోంది. అసలు వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫోటోలను ఉంచడం పట్ల గతంలోనే…బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం;లోనే తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖ రాసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని ఆరోపించింది. అయితే నాడు ఈసీ దీనిపై మౌనం వహించింది. బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య సఖ్యత ఏనాడో లోపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల్లో మా పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇక వ్యాక్సిన్ ధ్రువపత్రాల మీద మోదీ ఫోటోలు ఉంచడంలో అర్థం లేదని టీఎంసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు..

ఇలా ఉండగా శనివారం తృణమూల్ కాంగ్రెస్ సంస్థాగత సమావేశాలను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొదటిసారిగా ఇవి జరుగుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఎన్నికల సమయంలో ఈ పార్టీని వీడి బీజేపీలో చేరిన సీనియర్లలో చాలామంది మళ్ళీ తమ సొంత గూటిలో చేరడానికి ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలను నిర్వహించడం విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: కర్ణాటకలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య రగడ….ఇంతకీ రూ. 12 కోట్లు ఏమయ్యాయి ?…మాజీ సీఎం కుమారస్వామి ఫైర్

Prabhas Adipurush: ఆదిపురుష్‌కు ప్ర‌భాస్ అంత తీసుకుంటున్నాడా.? బాలీవుడ్ హీరోల‌కు సైతం దిమ్మ‌దిరిగి పోవాల్సిందే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!