Chanakya Niti: నాయకుడిగా ఉండాలంటే.. ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి.. అవేంటంటే!
ఆచార్య చాణక్యుడు అపర మేధావి. ఆయన చెప్పిన ఎన్నో జీవిత సూత్రాలు.. ప్రస్తుత పరిస్థితులకు చాలా అవసరం. అవి పాటించడానికి కొంచెం..
ఆచార్య చాణక్యుడు అపర మేధావి. ఆయన చెప్పిన ఎన్నో జీవిత సూత్రాలు.. ప్రస్తుత పరిస్థితులకు చాలా అవసరం. అవి పాటించడానికి కొంచెం కఠినంగానే ఉన్నా.. మనల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేస్తాయి. ఆచార్య చాణక్యుడు తన జీవితాంతం ప్రజల ప్రయోజనాల కోసమే పని చేశాడు. సమర్ధవంతమైన జీవన విధానాలను రూపొందించాడు. చాణక్యుడు రచించిన చాణక్య నీతిలోని సూత్రాలు నేటి కాలంలో కూడా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయి. అందులో పేర్కొన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక వ్యక్తి అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయగలడు. సమర్ధవంతమైన నాయకుడిగా మారడానికి ఓ వ్యక్తి ఎలాంటి లక్షణాలు అవలంబించుకోవాలి.? ఆచార్యుడు చెప్పిన సూత్రాలు ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అందరినీ వెంట తీసుకెళ్లే సామర్ధ్యం కలిగి ఉండాలి..
చాణక్య నీతి ప్రకారం.. నైపుణ్యం కలిగిన నాయకుడు.. అందరినీ వెంట తీసుకెళ్లగలిగే సామర్ధ్యం ఉన్న వ్యక్తిగా మారగలడు. ప్రతీ పని మనం సొంతంగా చేయగలం అని అనుకోకూడదు. ఏదొక సమయంలో ఎవరొకరు సహాయం అందించాలి. అందుకే ప్రతీ ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ.. వారిని వెంట తీసుకెళ్లగలిగే వ్యక్తి.. మంచి నాయకుడి అని రుజువు చేసుకోగలుగుతాడు.
నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ఉత్సాహం..
మనకి అన్ని తెలుసని అనుకోవడం అవివేకానికి పరాకాష్ట. మన జీవితంలో ఏదొకటి నేర్చుకుంటూనే ఉంటాం. అది ఎప్పటికీ ముగియని ప్రక్రియ. అడుగడుగునా ఏదొక కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు మంచి నాయకుడిగా ఉండాలంటే.. ఖచ్చితంగా మీలో ఈ లక్షణం తప్పకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయోగాలు చేయడం.. కొత్త విధానాలను నేర్చుకోవడం అవసరం. కాబట్టి మీకు నేర్చుకునే అవకాశం వచ్చినప్పుడల్లా, దాన్ని వదిలిపెట్టకండి.
సమయపాలన చాలా ముఖ్యం..
టైం ఎప్పుడూ మనకోసం ఆగదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే.. సమయపాలన చాలా ముఖ్యం. సరైన సమయానికి.. ఆ పనిని పూర్తి చేయగలిగిన వ్యక్తి మంచి నాయకుడు అవుతాడు. సమయాన్ని వృధా చేస్తూ.. పని తర్వాతైనా చేయొచ్చు అనుకునే వ్యక్తి.. తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: ఒక్క వికెట్ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?
హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..