AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: కష్ట సమయాల్లో ఈ నాలుగు విషయాలను ఖచ్చితంగా గుర్తించుకోండి.. అవేంటో తెలుసా!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఎన్నో గ్రంధాలు రచించిన చాణక్య.. నీతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన..

Chanakya Niti: కష్ట సమయాల్లో ఈ నాలుగు విషయాలను ఖచ్చితంగా గుర్తించుకోండి.. అవేంటో తెలుసా!
Chanakya Niti
Ravi Kiran
|

Updated on: Sep 05, 2021 | 9:48 AM

Share

ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఎన్నో గ్రంధాలు రచించిన చాణక్య.. నీతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరించారు. ఆ అంశాలు ఇప్పటికీ ప్రజలకు చాలా అవసరం. తమ జీవితంలో ఎలా ముందడుగు వేయాలన్న దానిపై చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే.. ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

ఇదిలా ఉంటే.. జీవితంలో గెలుపోటములు సహజం. గెలిచిన ప్రతీసారి గర్వం చూపించకూడదు. అలాగే ఓటమిని ఎదుర్కున్నప్పుడు సహనాన్ని కోల్పోకూడదని పెద్దలు అంటుంటారు. ఇదే సూత్రాన్ని చాణక్యుడు కూడా నమ్మారు. కష్ట సమయాల్లో ప్రతీ వ్యక్తికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అజాగ్రత్తగా ఉండకూడదు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి కష్ట సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

ఖచ్చితమైన వ్యూహం…

కష్ట సమయాల్లో ప్రతీ ఒక్కరూ తెలివిగా ఆలోచించాలి. ఖచ్చితమైన వ్యూహాన్ని రచించాలి. మనం ఎదుర్కుంటున్న సంక్షోభం నుంచి బయటపడాలంటే.. సరైన ప్రణాళికను సిద్దం చేసుకోవాలి. అలాగే ఆ ప్రణాళికలను దశలవారీగా అమలు చేస్తూ విజయాన్ని సాధించాలి.

కుటుంబ బాధ్యత..

చాణక్య నీతి ప్రకారం, కుటుంబం బాధ్యత మీ మొదటి విధి. కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు ఎలప్పుడూ మీకు తోడుగా ఉంటారు. వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఏ సమస్య వారి వరకు చేరకుండా జాగ్రత్తను వహించండి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ..

చాణక్యుడు ప్రకారం, ఆరోగ్యం అనేది మనిషికి విలువైన ఆస్తి. సిట్యువేషన్ ఎలాంటిదైనా ఆరోగ్యం పట్ల అజాగ్రత్త పనికిరాదు. మొదట మీరు ఆరోగ్యవంతంగా ఉంటే.. అన్ని సమస్యలను ఆటోమేటిక్‌గా అధిగమించగలరు.

డబ్బును ఖర్చు చేయడంలో సరైన వ్యూహం..

చాణక్యుడి ప్రకారం, కష్ట సమయాల్లో డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది మీతో ఉంటే ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడవచ్చు. ఒకవేళ కష్ట సమయాల్లో డబ్బు లేకపోతే.. సంక్షోభం నుంచి బయటపడటం చాలా కష్టం.

Also Read: Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. మీ మెదడుకు పరీక్ష.. పజిల్‌ను క్షణాల్లో సాల్వ్ చేయండి.!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌