AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్యుడు చెప్పిన.. అదృష్టాన్ని, ధనాన్ని పెంచే ఈ మూడింటినీ ఎప్పుడూ వదలొద్దు..!

Chanakya Neeti: ప్రతీ వ్యక్తి తన ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆచార్య చాణక్యుడు. ఎందుకంటే అది కష్ట సమయంలో మీకు సహాయపడుతుందంటున్నారు. అదే విధంగా మీరు కొన్ని సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయక తప్పదని.. వాటి నుంచి తిరిగి అంతకుమించి డబ్బు తిరిగి వస్తుందని చెప్పుకొచ్చారు. చాణక్యుడు డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి లేదా పెట్టుబడి పెట్టాలని సూచించారో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: చాణక్యుడు చెప్పిన.. అదృష్టాన్ని, ధనాన్ని పెంచే ఈ మూడింటినీ ఎప్పుడూ వదలొద్దు..!
Chanakya Niti
Rajashekher G
|

Updated on: Jan 29, 2026 | 9:52 AM

Share

డబ్బు అనేది అందరికీ అవసరమే. డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు అన్నీ డబ్బుతో ముడిపడిన అంశాలే ఉన్నాయి. అందుకే డబ్బు కోసం మనిషి శ్రమిస్తూనే ఉంటాడు. ఎవరికి సాధ్యమైన పని వారు చేసి సంపాదించుకుంటూ ఉంటారు. అయితే డబ్బును పెంచుకోవడంపై చాలా తక్కువ మంది మాత్రమే దృష్టి సారిస్తుంటారు. భారత ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు డబ్బు గురించిన కీలక సూచనలు చేశారు. డబ్బు ఉంటే మీరు పెద్ద పెద్ద కష్టాల నుంచి కూడా బయటపడవచ్చని అంటారు. అందుకే ప్రతీ వ్యక్తి తన ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే అది కష్ట సమయంలో మీకు సహాయపడుతుందంటున్నారు. అదే విధంగా మీరు కొన్ని సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయక తప్పదని.. వాటి నుంచి తిరిగి అంతకుమించి డబ్బు తిరిగి వస్తుందని చెప్పుకొచ్చారు. చాణక్యుడు డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి లేదా పెట్టుబడి పెట్టాలని సూచించారో ఇప్పుడు తెలుసుకుందాం.

పేదలకు, నిస్సహాయులకు సహాయం

మనం సమాజానికి ఏదైనా ఇవ్వాలి.. ఈ సమాజం వల్లే మనం ఎదిగామని ఒక వ్యక్తి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని చాణక్యుడు స్పష్టం చేస్తున్నాడు. సమాజం మనల్ని ఎదగడానికి పనిచేస్తుంది, కాబట్టి మనం ఈ ఏదైనా తిరిగి ఇవ్వాలి. ఈ భావనతో మన ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు, నిస్సహాయులకు ఖర్చు చేయాలి. ఇది మీరు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి, ఇది మీ అదృష్టాన్ని బలపరుస్తుంది.

మతపరమైన పనికి సహాయం

చాణక్యుడు ఒక వ్యక్తి ఎల్లప్పుడూ మతపరమైన పనికి సహాయం చేయాలని సూచించారు. మీరు మతపరమైన పనికి సహాయం చేసినప్పుడు, మీ సంపద తగ్గదు, బదులుగా పెరుగుతాయన్నారు. ఇది కూడా ఒక రకమైన పెట్టుబడి, దీని ద్వారా మీరు దేవుని ఆశీర్వాదాలను పొందుతారు. మోక్షాన్ని సాధిస్తారు.

ప్రజా సేవలలో సహాయం, విరాళాలు

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఒక వ్యక్తి ఎప్పుడూ ప్రజా సేవలో పాల్గొనాలి. ఇది మీ ప్రజా సంబంధాలను పెంచుతుంది. కాబట్టి మీరు ప్రజా సేవ, ఆహార దాన కార్యక్రమాలకు ఉదారంగా సహాయం చేయాలి. డబ్బు మీకు మద్దతు ఇవ్వనప్పుడు, మీరు సంపాదించిన వ్యక్తులు మాత్రమే మీకు ఉపయోగపడతారని చాణక్యుడు స్పష్టం చేశారు. కాబట్టి చాణక్యుడు ఈ మూడు ప్రదేశాలలో పెట్టుబడి పెట్టాలని సలహా ఇచ్చాడు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)