చాణక్య నీతి
చాణక్యుడు ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప తత్వవేత్త, రాజకీయ నిపుణుడు, ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడికి గురువుగా వ్యవహరించారు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందిన మౌర్య సామ్రాజ్యానికి ప్రధాన వ్యూహకర్త అయిన చాణక్యుడు.. అర్థశాస్త్రం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. రాజనీతి, ధనం, పరిపాలనపై అపారమైన జ్ఞానం ఆయన సొంతం. చంద్రగుప్తుడిని సామ్రాజ్యాధిపతిగా తీర్చిదిద్దిన మేధావి. ఆయన జీవిత అనుభవాల నుంచి వచ్చిన ఆచరణాత్మక సూక్తుల సమాహారమే చాణక్య నీతి. జీవన పాఠాలతో పాటు రాజనీతి, ధన నీతి, మిత్రత్వం, శత్రుత్వం వంటి అంశాలపై చాణక్యుడు ఆచరణాత్మక సూత్రులు చెప్పారు. అతిగా నిజాయితీగా ఉండేవాడు మూర్ఖుడిగా భావించబడతాడు అంటూ పరిస్థితికి తగిన జ్ఞానం అవసరమని చాణక్యుడు సూచించాడు. అలాగే విద్య లేని ధనం అహంకారానికి దారి తీస్తుందంటూ.. జ్ఞానంతో పాటు వినయం ముఖ్యమని పేర్కొన్నాడు. శత్రువుని చిన్నవాడిగా తక్కువ అంచనా వేయకూడదని తన రాజనీతిలో బోధించాడు. ఆలస్యం విజయానికి అడ్డంకిగా పేర్కొన్న చాణక్యుడు.. క్రమశిక్షణతో విజయం తథ్యమని బోధించాడు.
Chanakya Niti: చాణక్య నీతి జీవితాన్ని మార్చే రహస్యాలు.. ఇవి పాటిస్తే ఫెయిల్యూర్ లేదు!
Chanakya Neeti: జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనేదానిపై ఆచార్య చాణక్యుడు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. చాణక్య నీతి అంటే జీవితం, రాజకీయం, ధనం, మిత్రత్వం, శత్రుత్వం వంటి అంశాలపై చాణక్యుడు చెప్పిన ఆచరణాత్మక సూత్రాల సంగ్రహం. కొన్ని ప్రసిద్ధ చాణక్య నీతులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Jan 30, 2026
- 9:22 am
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన.. అదృష్టాన్ని, ధనాన్ని పెంచే ఈ మూడింటినీ ఎప్పుడూ వదలొద్దు..!
Chanakya Neeti: ప్రతీ వ్యక్తి తన ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆచార్య చాణక్యుడు. ఎందుకంటే అది కష్ట సమయంలో మీకు సహాయపడుతుందంటున్నారు. అదే విధంగా మీరు కొన్ని సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయక తప్పదని.. వాటి నుంచి తిరిగి అంతకుమించి డబ్బు తిరిగి వస్తుందని చెప్పుకొచ్చారు. చాణక్యుడు డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి లేదా పెట్టుబడి పెట్టాలని సూచించారో ఇప్పుడు తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Jan 29, 2026
- 2:21 pm