AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ 5 విషయాలను అస్సలు మరిచిపోవద్దు..!

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా

చాణక్య నీతి: జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ 5 విషయాలను అస్సలు మరిచిపోవద్దు..!
ఆచార్య చాణక్యుడు ప్రతికూలత అనేది ప్రతీ వ్యక్తికి తన సొంత శక్తిని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుందని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తెలిపాడు. ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన 5 గుణాలను ప్రస్తావిస్తూ.. అలాంటి వ్యక్తిని అందరూ మెచ్చుకుంటారని తెలిపాడు.
uppula Raju
|

Updated on: Feb 24, 2022 | 11:35 AM

Share

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నంద వంశం నాశనమైంది. చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య తక్ష శిలలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. సమాజం పట్ల, మనిషి నడవడిక పట్ల మంచి అవగాన ఉన్న వ్యక్తి. చాణుక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరించారు. అయితే జీవితంలో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలంటే ఈ ఐదు విషయాలను ఎప్పుడు మరిచిపోకూడదని చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.

1. మీ దగ్గరి వ్యక్తిని, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని ఎప్పుడు మోసం చేయవద్దని సూచించాడు. ఒకవేళ అలా చేస్తే వారు తీసుకున్న గొయ్యిలో వారే పడతారని చెప్పాడు. కాబట్టి ఎల్లప్పుడూ మీ ప్రియమైన వారికి విధేయతతో ఉండాలని తెలిపాడు. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ సొంత వ్యక్తులు మాత్రమే మీకు అండగా ఉంటారని గుర్తుంచుకోండి.

2. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన గొప్ప పనుల ద్వారా గొప్పగా మారుతాడు. అందువల్ల ఏ పని చేసేముందైనా ధృడమైన లక్ష్యంతో పనిచేయాలని సూచించాడు. దీపం చిన్నదే అయినా చీకటిని తరిమేస్తుంది కానీ దీపం చీకటి కంటే పెద్దది కాదని గుర్తుంచుకోవాలని చెప్పాడు.

3. చాణక్య ఒక వ్యక్తి ఎంత సంపాదించినా అందులో కొంత దానం చేయాలని చెబుతాడు. తన గురించి మాత్రమే ఆలోచించి వస్తువులను కూడబెట్టుకునే వ్యక్తి చివరకు ఒంటరిగా మిగులుతాడని గుర్తు చేశాడు. తేనెటీగలు తేనెను సేకరిస్తున్నట్లే చివరికి అతడికి కూడా ఏమి మిగలదని తెలిపాడు.

4. చాణక్య ప్రకారం మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలంటే మీ ప్రియమైన వారి పట్ల ఉదార​​వైఖరిని కలిగి ఉండండి. పెద్దల పట్ల వినయంగా ఉండండి. మంచి వ్యక్తుల పట్ల ప్రేమను కలిగి ఉండండి. శత్రువు ముందు ధైర్యంగా నిలబడండని సూచించాడు.

5. ఆచార్య చాణక్యుడు దాతృత్వం, మాటల్లో మాధుర్యం, ధైర్యం, ప్రవర్తనలో వివేకం మొదలైన సద్గుణాలను పొందలేమని చెప్పాడు. కానీ ఇవన్నీ ఒక వ్యక్తి అంతర్భాగంలో కలసి ఉంటాయని మాత్రం చెప్పాడు.

Pensioners Alert: పెన్షనర్లు అలర్ట్‌.. ఈ రెండు విషయాలలో మార్పులు గమనించారా..!

Jaggery: మహిళలకు గమనిక.. ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే..?

Mileage Bikes: సామాన్యుడి బతుకుబండి నడిపిస్తున్న 4 బైక్‌లు.. ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!