AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఉన్న పూజగదిలో డబ్బు దాస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

vastu tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేటప్పుడు ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలనే దానిపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఉదాహరణకు అగ్ని మూలకానికి

Vastu Tips: ఇంట్లో ఉన్న పూజగదిలో డబ్బు దాస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!
Puja
uppula Raju
|

Updated on: Feb 24, 2022 | 4:18 PM

Share

vastu tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేటప్పుడు ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలనే దానిపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఉదాహరణకు అగ్ని మూలకానికి సంబంధించిన వస్తువులను నీటి మూలకం దిశలో ఉంచకూడదు. ఈ వాస్తు నియమాలను విస్మరించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఇబ్బందులకు గురవుతాడు. కలల ఇంటిని తయారు చేసేటప్పుడు దాని అందం మాత్రమే కాదు దానికి సంబంధించిన వాస్తు నియమాలు కూడా పాటించాలి. ఎందుకంటే ఆనందం, శ్రేయస్సు ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటాయి. ఈ పరిస్థితిలో ఇంటిలోని పూజ గదిలో ఏ వస్తువులు ఉంచాలి అనేది కూడా చాలా ముఖ్యమైనది. లక్ష్మి దేవి సంతోషంగా ఉండటానికి.. ఆమె అనుగ్రహం పొందడానికి ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో తెలుసుకుందాం.

ఇంటికి ఉత్తర దిశలో అందమైన పూలను నాటండి. ఇంట్లో వేణువు, కృష్ణుడి బొమ్మ, నెమలి ఈకలను ఉంచడం ద్వారా కుటుంబంలో పరస్పర ప్రేమ ఏర్పడుతుంది. ఇంటి ఉత్తర గోడకు ఆకుపచ్చ రంగు వేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. ఇంటి ఉత్తర గోడపై పంచముఖి హనుమంతుని చిత్రపటాన్ని ఉంచడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని ఉంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో మొక్కలు ఎండిపోవద్దు వాటికి క్రమం తప్పకుండా నీరు పోయాలి.

ఇంటి తలుపులు పగలకూడదని గుర్తుంచుకోండి. పూజ గదిలో శంఖాన్ని ఉంచండి. పూజగదిలో సంపద, ఆస్తిని ఎప్పుడు దాచి పెట్టకూడదు. ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. మహాభారత యుద్ధాన్ని తెలిపే పక్షుల చిత్రాలు, చిత్రాలను ఇంట్లో ఉండకూడదు. వంటగదిలో అన్నపూర్ణ తల్లి చిత్రపటాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి మెయిన్ డోర్ వాస్తు ప్రకారం ఉండాలి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి ఇంట్లో శ్రీ రాధా-కృష్ణుల చిత్రాన్ని ఉంచండి. నెమలి, వీణ, పుస్తకం, కలం, హంస, చేపల చిత్రాలను ఇంటి స్టడీ రూమ్‌లో పెట్టుకోవచ్చు. పిల్లల పడకగదిలో పచ్చని పండ్ల చెట్లు, ఆకాశం, మేఘాలు, చంద్రుడు, పవిత్రమైన బొమ్మల చిత్రాలను ఉంచండి. పిల్లల సంతోషం కోసం పడకగదిలో శ్రీకృష్ణుడి బొమ్మను పిల్లల రూపంలో ఉంచవచ్చు. పూజగదిలో చనిపోయిన బంధువుల ఫోటోలు పెట్టకండి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Diabetics: షుగర్ పేషెంట్లు పాలు తాగుతున్నారా.. కచ్చితంగా ఈ 3 విషయాలపై దృష్టి పెట్టండి..!

Health Tips: ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే..?

Health Tips: రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఈ పనిని విస్మరిస్తున్నారా.. అస్సలు మరవకండి..!