Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetics: షుగర్ పేషెంట్లు పాలు తాగుతున్నారా.. కచ్చితంగా ఈ 3 విషయాలపై దృష్టి పెట్టండి..!

Diabetics: భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీరు తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు లేదా

Diabetics: షుగర్ పేషెంట్లు పాలు తాగుతున్నారా.. కచ్చితంగా ఈ 3 విషయాలపై దృష్టి పెట్టండి..!
Diabetics
Follow us
uppula Raju

|

Updated on: Feb 24, 2022 | 3:32 PM

Diabetics: భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీరు తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఒక్కసారి డయాబెటీస్‌ బారిన పడితే జీవితాంతం ఆహారం, పానీయాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్పాహారంగా పాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు ప్రయోజనం ఉంటుంది. పాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఉదయాన్నే పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మూడు పద్దతుల ద్వారా పాలు తీసుకుంటే మంచి ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. పసుపు పాలు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పసుపు పాలు చాలా మేలు చేస్తాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

2. దాల్చిన చెక్క పాలు

దాల్చిన చెక్క పాలు చక్కెర రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే దాల్చినచెక్క రక్తంలో చక్కెరను నియంత్రించడానికి పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలు, దాల్చినచెక్క మిశ్రమంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

3. బాదం పాలు

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే బాదం పాలు మీకు చాలా మంచిది. బాదం పాలు మార్కెట్లో సులువుగా దొరుకుతాయి. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు D, E, అవసరమైన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది.

Health Tips: ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే..?

Over sleeping: అవసరానికి మించిన నిద్ర వద్దు.. దుష్ప్రభావాలు తెలిస్తే షాక్..!

Health Tips: రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఈ పనిని విస్మరిస్తున్నారా.. అస్సలు మరవకండి..!