Health Tips: ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే..?

Health Tips: చలికాలం ముగుస్తుంది.. మరికొన్ని రోజుల్లో వేసవి ప్రారంభంకాబోతుంది. దీంతో అందరు వేసవి ఆహారాలపై దృష్టి పెడుతున్నారు.

Health Tips: ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే..?
Yogurt
Follow us
uppula Raju

|

Updated on: Feb 24, 2022 | 3:28 PM

Health Tips: చలికాలం ముగుస్తుంది.. మరికొన్ని రోజుల్లో వేసవి ప్రారంభంకాబోతుంది. దీంతో అందరు వేసవి ఆహారాలపై దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం కిరణా షాపులకి వెళ్లి సమాను కొనాల్సిన పనిలేదు. మారుతున్న ఉష్ణోగ్రత, తేమ స్థాయిలను ఎదుర్కొవడానికి చిన్న చిన్న ఆహార మార్పులు చేస్తే చాలు. వాస్తవానికి వేసవిలో ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేసేది పెరుగు. అందుకే సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరు పెరుగు తింటారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. చర్మం, జుట్టు సమస్యలని నివారిస్తుంది. పెరుగు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో గొప్పగా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బలమైన ఎముకలను నిర్మిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అయితే మీరు బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నట్లయితే పెరుగు విషయంలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఎలా పడితే అలా తినకూడదని చెబుతోంది. పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పెరుగు కొవ్వుని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అయితే పెరుగు తింటే బరువు పెరుగుతారని ఆయుర్వేదం సూచిస్తోంది. పెరుగుని ఎప్పుడు వేడి చేయకూడదు. ఎందుకంటే అది దాని లక్షణాలను కోల్పోతుంది. ఊబకాయం, కఫా రుగ్మతలు, రక్తస్రావం రుగ్మతలు, ఉన్నవారు పెరుగును నివారించడం ఉత్తమం. రాత్రిపూట పెరుగు ఎప్పుడూ తినకూడదని ఆయుర్వేదం సూచిస్తోంది.

రాళ్ల ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన మజ్జిగను రోజూ తింటే మంచిదని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం. పెరుగును పండ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఇది అలర్జీలను ప్రేరేపిస్తుంది. చికెన్, మటన్ లేదా చేప వంటి వంటకాలతో పెరుగు తినకూడదు. విషంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీకు పెరుగు కావాలంటే అప్పుడప్పుడు మధ్యాహ్నం మితంగా తింటే చాలని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు.

Over sleeping: అవసరానికి మించిన నిద్ర వద్దు.. దుష్ప్రభావాలు తెలిస్తే షాక్..!

Health Tips: రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఈ పనిని విస్మరిస్తున్నారా.. అస్సలు మరవకండి..!

Oils: ఈ 5 సహజ నూనెలతో అనేక సమస్యలు పరిష్కారం.. ఆయుర్వేద వైద్యుల ఉత్తమ ఎంపిక..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!