Over sleeping: అవసరానికి మించిన నిద్ర వద్దు.. దుష్ప్రభావాలు తెలిస్తే షాక్..!
Oversleeping: మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది మీకు శక్తిని ఇస్తుంది. రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.
Oversleeping: మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది మీకు శక్తిని ఇస్తుంది. రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అనారోగ్య సమస్యలని నివారిస్తుంది. అయితే అవసరానికి మించి నిద్ర కూడా చాలా ప్రమాదం. ఒక వ్యక్తి రోజుకి 8 గంటలు నిద్రపోతే చాలు. అంతకంటే ఎక్కువసేపు పడుకుంటే అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. వాస్తవానికి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే సెరోటోనిన్ హార్మోన్ మన నిద్ర, మేల్కొనే విధానాలను నియంత్రిస్తుంది. మీరు ఎక్కువగా నిద్రపోతే అది సెరోటోనిన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్లకు అంతరాయం కలిగిస్తుంది. దీని కారణంగా తలనొప్పి సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు పడుకుంటే చాలా ఆకలి, దాహంగా ఉంటుంది. ఇది కూడా తలనొప్పికి దారితీస్తుంది.
మీకు ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉంటే అది వెన్నునొప్పికి కారణమవుతుంది. మీరు చెడిపోయిన పరుపై పడుకున్నా ఈ సమస్య ఎదురవుతుంది. ఇది కండరాలపై ఒత్తిడి తెస్తుంది. రోజు మొత్తం బద్దకంగా ఉంటుంది. డిప్రెషన్ లక్షణాలు కూడా ఉంటాయి. మానసిక సమస్యలకు గురవుతారు. శరీరంలో జరిగే మార్పుల వల్ల విపరీతమైన ఆకలి సమస్య ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా తింటారు. తద్వారా డయాబెటీస్, అధిక బరువు సమస్యలు ఏర్పడుతాయి. ఒక పరిశోధన ప్రకారం ఎక్కువ సేపు పడుకునే వ్యక్తులు గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రతి రోజూ రాత్రి 7నుంచి 8 గంటలు నిద్రపోయే వారికంటే 8 నుంచి 9 గంటలు నిద్రపోయే వారిలో డెత్ రేట్స్ అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాలలో తేలింది.
తక్కువ నిద్ర వల్ల సమస్యలు
ఇదిలా ఉంటే తక్కువ నిద్ర వల్ల కూడా సమస్యలు ఏర్పడుతాయి. వాటిలో తలనొప్పి, చికాకు, కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం పాలిపోవడం, ముడతలు ఏర్పడటం, మగత, ఆకలి వేయకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నిద్ర సరిపోకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. నిద్ర తక్కువ కావడం వల్ల హైబీపీ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తక్కువ, ఎక్కువ కాకుండా ప్రతిరోజు 8 గంటలు పడుకుంటే చాలు.