Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఈ పనిని విస్మరిస్తున్నారా.. అస్సలు మరవకండి..!

Health Tips: మారిన జీవన పరిస్థితుల కారణంగా చాలామంది టిఫిన్, లంచ్‌, డిన్నర్ ఏ సమయంలో చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ

Health Tips: రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఈ పనిని విస్మరిస్తున్నారా.. అస్సలు మరవకండి..!
Walking After Dinner
Follow us
uppula Raju

|

Updated on: Feb 24, 2022 | 1:44 PM

Health Tips: మారిన జీవన పరిస్థితుల కారణంగా చాలామంది టిఫిన్, లంచ్‌, డిన్నర్ ఏ సమయంలో చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ తిండి తిన్న తర్వాత కచ్చితంగా వాకింగ్‌ చేయాలి. కానీ చాలామంది దీనిని విస్మరిస్తున్నారు. తిన్న వెంటనే బెడ్‌పై వాలిపోతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది వ్యక్తులు పని ఒత్తిడి వల్ల బిజీగా ఉంటారు. ఫిట్‌నెస్‌పై అస్సలు శ్రద్ధ చూపరు. అయితే మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం నడవాల్సిన అవసరం ఉంది. పగటిపూట నడవడం కష్టంగా ఉంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత నడవాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి భోజనం తర్వాత క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సరైన సమయంలో టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయి. మీ అంతర్గత అవయవాల పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది.

1. రాత్రిపూట ఏదైనా తినాలనే కోరిక ఉండదు

చాలా మందికి డిన్నర్ సమయంలో ఏదైనా తినాలనే కోరిక ఉంటుంది. కానీ కొద్దిసేపు వాకింగ్ చేస్తే దీనిని మరిచిపోతారు. దీని వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడుతారు.

2. మంచి నిద్ర

మీకు రాత్రి నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే, రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడానికి ప్రయత్నించండి. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రకు సహాయపడుతుంది.

3. చక్కెర నియంత్రణలో ఉంటుంది

రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఎందుకంటే నడక సమయంలో శరీరం రక్తంలో ఉన్న గ్లూకోజ్‌లో కొంత భాగాన్ని వినియోగిస్తుంది.

18 సంవత్సరాలు దాటిన మహిళలకు సువర్ణవకాశం.. ఉచితంగా ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్..!

Oils: ఈ 5 సహజ నూనెలతో అనేక సమస్యలు పరిష్కారం.. ఆయుర్వేద వైద్యుల ఉత్తమ ఎంపిక..!

చాణక్య నీతి: జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ 5 విషయాలను అస్సలు మరిచిపోవద్దు..!