Knowledge: మద్యం సేవించగానే అందుకే కంట్రోల్ తప్పుతారు! లివర్ ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం ఇదే..
మద్యం (alcohol) సేవించినప్పుడు, మత్తు పదార్ధలు ఏవైనా తీసుకున్నా వెంటనే శరీరం కంట్రోల్ తప్పుతుంది. అంటే శరీరం స్వాదీనం తప్పిపోతుంది, అడుగులు ఎటుపడుతున్నాయో కూడా తెలియని స్థితిలోకి చేరుకుంటారు.. మాటలు కూడా తడబడిపోతుంటాయి.. ఎందుకో ఎప్పుడైనా గమనించారా?..
How Alcohol affects the central nervous system: మద్యం (alcohol) సేవించినప్పుడు, మత్తు పదార్ధలు ఏవైనా తీసుకున్నా వెంటనే శరీరం కంట్రోల్ తప్పుతుంది. అంటే శరీరం స్వాదీనం తప్పిపోతుంది, అడుగులు ఎటుపడుతున్నాయో కూడా తెలియని స్థితిలోకి చేరుకుంటారు.. మాటలు కూడా తడబడిపోతుంటాయి.. ఎందుకో ఎప్పుడైనా గమనించారా? మత్తు పదార్ధాలు శరీరంలో ఏ విధమైన మార్పులు కలిగిస్తాయో.. వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆ విశేషాలు మీకోసం.. ఆల్కహాల్ ఒక సిప్ సేవించిన వెంటనే, అది శరీరంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. మొదటిగా కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ (gastric acid)ను పెంచి, కడుపులో మంట పుట్టేలా చేస్తుంది. ఆ తర్వాత ప్రేగులు ఆల్కహాల్‌ను గ్రహించి, పక్కనే ఉండే కాలేయానికి చేరవేస్తాయి. మద్యం సేవిస్తే లివర్ చెడిపోతుందని అందుకే డాక్టర్లు చెబుతారు. ఆల్కహాల్ కడుపులో నుంచి నేరుగా కాలేయానికి చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
Deutsche Welle నివేదిక ప్రకారం.. ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేసే గుణం లివర్‌కు ఉంటుంది. శరీరంపై దీని ప్రభావాన్ని తగ్గేలా చేస్తుంది. ఐతే లివర్ విచ్ఛిన్నం చేయలేని కొన్ని మూలకాలు (ఎలిమెంట్స్) నేరుగా మెదడుకు చేరుతాయి. ఇటువంటి పరిస్థితిలో.. కొన్ని నిమిషాల్లోనే ఆల్కహాల్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఇది జరిగిన తర్వాత నాడీ వ్యవస్థ కనెక్షన్ బ్రేక్ అవుతుంది. ఫలితంగా కణాలు చాలా స్లోగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ విధమైన పరిస్థితిని మెదడు నిర్వహించడంలో వైఫల్యం చెందుతుంది. అంతేకాదు శరీరంలోపలికి వెళ్లిన ఆల్కహాల్ మెదడు కేంద్ర భాగంపై కూడా దాడి చేస్తుంది. అందువల్లనే మత్తు పదార్ధాలు సేవించిన వ్యక్తి తన శరీరంపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది.
ఆల్కహాల్ సేవిస్తే లివర్‌పై దాని ప్రభావం విపరీతంగా పడటం మూలంగా, లివర్ తన పనిని సరిగ్గా చేయలేకపోతుంది. ఆశ్చర్యమేమంటే లివర్‌లో ఇన్ని మార్పులు చోటుచేసుకున్నా.. కనీసం నొప్పి కూడా ఉండదు. అందువల్లనే మద్యం సేవించేవారికి లివర్‌పై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్లి, పరీక్షించుకుంటేగానీ లివర్ చెడిపోయిందనే విషయం తెలియదు. ఇప్పటికే మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే వెంటనే వెళ్లి లివర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా! మీరేమంటారు..
Also Read: