Viral News: ఇదేందిరయ్యా.. కొత్తిమీర ఐస్‌క్రీం అంట.. తలబాదుకుంటున్న నెటిజన్లు..
Coriander Ice Cream: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వంటకాలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల పలు వింత వంటలు చూసి.. ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెట్టారు.
Coriander Ice Cream: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వంటకాలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల పలు వింత వంటలు చూసి.. ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెట్టారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, వెజ్ ఫిష్ ఫ్రై, పచ్చి మిర్చి హల్వా ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీటిని చూసి నెటిజన్లు ఇదేం పోయే కాలం రా..? నాయనా.. ఇవన్నీ తినడానికేనా అంటూ నోరెళ్లబెట్టారు. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం ట్రెండ్ (Trending) అవుతోంది. ఈ వంటకాన్ని మార్కెట్లోకి పరిచయం చేసింది చిన్న వ్యాపారులు కాదు.. ఓ ప్రపంచస్థాయి ప్రముఖ కంపెనీ ఈ సరికొత్త వంటకాన్ని అందుబాటులో ఉంచింది. అదే కొత్తిమీర ఐస్ క్రీం.. దీన్ని చూసి నెటిజన్లు (Netizens) వామ్మో అంటూ అదిరిపోయే రియాక్షన్స్ ఇస్తున్నారు.
సాధారణంగా.. ఐస్‌క్రీం అనగానే అందరికీ నోరూరుతుంది. చాలామంది ఐస్‌క్రీం తినకుండా అస్సలు ఉండలేరు. చిన్నపిల్లలు ఐస్ క్రీం తినేందుకు ఏవేవో సాకులు కూడా చెబుతుంటారు. అయితే.. అలాంటి ఐస్‌క్రీంతో ఏవేవో ప్రయోగాలు కూడా చేస్తుంటారు. తాజాగా.. ఓ ప్రముఖ కంపెనీ చేసిన ప్రయోగంపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇటీవల కాలంలో కొత్తిమీర ఐస్ క్రీం నెట్టింట వైరల్ అవుతోంది. అంతకుముందు వైరల్ అయిన విచిత్ర వంటకాల మాదిరిగానే.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రజలకు నచ్చే ఐస్‌క్రీమ్‌తో ఈసారి ప్రయోగం చేసింది.. మెక్‌డొనాల్డ్స్ కంపెనీ.. వాస్తవానికి మెక్‌డొనాల్డ్స్ కొత్తిమీరతో అలంకరించిన ప్రత్యేక ఐస్‌క్రీమ్‌ను చైనాలో తెరపైకి తెచ్చింది. ఫాస్ట్ ఫుడ్ చైన్‌ను నడుపుతున్న ఈ పెద్ద కంపెనీ కొత్తిమీర సండే పేరుతో ఈ డెజర్ట్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా పరిచయం చేసింది. వాస్తవానికి ఇది ఫిబ్రవరి 25 వరకు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కొత్తిమీర, నిమ్మకాయ సాస్, కొత్తిమీర చట్నీను ఐస్ క్రీంకు యాడ్ చేసి ఇస్తారు. ఈ ఐస్‌క్రీం ధర భారతీయ కరెన్సీలో దాదాపు రూ.77.
Mcdonald’s China launched a Cilantro Sundae special menu item today, which is interesting… pic.twitter.com/uHgA3vyn2Y
— Daniel Ahmad (@ZhugeEX) February 21, 2022
ఈ వింత ఐస్ క్రీం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే చాలా మంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరికొంత మంది ఈ ప్రయోగాన్ని ఒకసారి టెస్ట్ చేద్దామనే కోరికను వ్యక్తం చేయగా.. చాలా మంది యూజర్లు ఇదేం క్రియేటివిటీరా బాబూ అంటూ తలబాదుకుంటున్నారు. ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఐస్‌క్రీం గురించి నెట్టింట పెద్ద స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది.
Cilantro lovers be like: (not me) pic.twitter.com/2gBH6SNjvD
— Alysterwolf ?? (@Alysterwolf) February 21, 2022
Also Read: