Viral Video: శునకానికి హారతి పట్టిన సోసైటీ వాసులు.. ‘విస్కీ’ స్టోరీ విని ఆశ్చర్యపోతున్న నెటిజనం.. ఏమైందంటే..?

Welcome Missing Dog: మనుషులు, జంతువుల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. జంతువులతో ఎంత స్నేహం చేస్తే అంత.. చనువుగా ఉంటాయి.

Viral Video: శునకానికి హారతి పట్టిన సోసైటీ వాసులు.. ‘విస్కీ’ స్టోరీ విని ఆశ్చర్యపోతున్న నెటిజనం.. ఏమైందంటే..?
Viral
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 24, 2022 | 10:01 AM

Welcome Missing Dog: మనుషులు, జంతువుల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. జంతువులతో ఎంత స్నేహం చేస్తే అంత.. చనువుగా ఉంటాయి. ఇక మనుషులు, శునకాల మధ్య స్నేహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కలు తమ యజమాని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధ పడతాయి. అలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో (Social Media) మనం ఎన్నో విని ఉంటాం.. చూశాం కూడా. వాటి గురించి తెలుసుకుని షాక్ అవుతాం. ఈ రోజుల్లో ఇలాంటి వార్త ఒకటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఒక కుక్క ఎక్కడో తప్పిపోయింది.. కానీ అది కనిపించగానే వేడుక చేశారు. ఒక వ్యక్తి యుగాల తర్వాత తన ఇంటికి తిరిగి వస్తున్నట్లుగా.. ఆ ప్రాంత వాసులు కుక్కకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

తప్పిపోయిన తమ కుక్క.. దొరికిందన్న ఆనందంతో ముంబైలోని ఒక సొసైటీలోని వాసులు దానికి స్వాగతం పలికిన తీరు వేడుకలా కనిపించింది. సొసైటీలో ఉంటుటున్న ఈ కుక్క కనిపించకుండా పోవడంతో చాలామంది ఆందోళన వ్యక్తంచేశారు. కొంతమంది అయితే.. కుక్క పొయిందంటూ అన్నం తినడం కూడా మానేశారంట. అయితే తమకు ఎంతో ఇష్టమైన డాగీ విస్కీ దొరికిందని.. మళ్లీ సొసైటీకి వస్తుందని తెలియగానే హారతితో స్వాగతించారు. విస్కీ అంటే.. కేవలం కుక్క కాదు.. మాకు అంతకంటే ఎక్కువ అంటూ సొసైటీ వాసులు పేర్కొంటున్నారు.

సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. సొసైటీకి చెందిన విస్కీ (శునకం) ఫిబ్రవరి 8న ప్రభాదేవి ఇంటి నుంచి తప్పిపోయింది. ఆ తర్వాత అది విల్సన్ కాలేజీకి సమీపంలో ఫిబ్రవరి 15న కనిపించింది. అయితే.. దాని కోసం సొసైటీకిచి చెందిన యువకులు కొన్ని రోజులు గాలించారు. ఆ తర్వాత దానిని కనుగొనడానికి సోషల్ మీడియాలో ‘ఫైండింగ్ విస్కీ’ అనే ప్రచారం కూడా నిర్వహించారు. ఇది చూసిన కొందరు విస్కీ జాడ చెప్పడంతో.. దాని దగ్గరకు వెళ్లి కారులో సొసైటీకి చేర్చారు యువకులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో.. 

Also Read:

Viral Video: దమ్ముంటే ఇక్కడకు వచ్చేయండి చూద్దాం.. వేటగాళ్లకు జింకల సవాల్.. వీడియో

AP News: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?