Food Combinations: ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి ప్రమాదమే.. ఏంటో తెలుసా..

మనం ఆరోగ్యంగా.. ఉత్సాహంగా ఉండటమనేది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే పదార్థాలలో ప్రోటీన్స్, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి

Food Combinations: ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి ప్రమాదమే.. ఏంటో తెలుసా..
Food
Follow us

|

Updated on: Feb 24, 2022 | 5:32 PM

మనం ఆరోగ్యంగా.. ఉత్సాహంగా ఉండటమనేది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే పదార్థాలలో ప్రోటీన్స్, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొందరు మంచి టేస్ట్ కోసం.. రెండు రకాల ఆహార పదార్థాలను జత చేసి తీసుకుంటారు. ఇలా రెండు రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వలన నాలుకకు మరింత రుచి లభిస్తుంది కానీ.. ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు. ఈ రెండు రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరి అవెంటో తెలుసుకుందామా.

సాధారణంగా చాలా మంది పాలు. నారింజ కలిపి తీసుకుంటారు. అలాగే.. నారింజ జ్యూస్ లో పాలు కలుపుకొని తాగుతుంటారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన ఉబ్బరం సమస్య వస్తుంది. పాలతోపాటు.. సిట్రస్ ఆహారాలను కలిపి తీసుకోవడం వలన గుండెల్లో మంట, యాసిడ్, రిప్లక్స్, వాపు వంటి సమస్యలు కల్గుతాయి. అలాగే లాక్టోస్ అసహనంతో బాధపడేవారు పాలను తీసుకోకపోవడం మంచిది.

ఇక ఆయుర్వేదం ప్రకారం పెరుగు, చేపలు కలిపి అస్సలు తీసుకోవద్దు. పెరుగుతోపాటు చేపలను కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ, ప్రేగులపై ప్రభావం చూపిస్తుంది. అలాగే చర్మ సమస్యలు పెరుగుతాయి. పాలు కండరాల బలాన్ని పెంచుతుంది. చాలా మంది పాలలో అరటి పండు కలుపుకొని తినడం అలవాటు. ఈ రెండు కలిపి తీసుకుంటే.. జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాపు సమస్య వేధిస్తుంటుంది. ఇవే కాకుండా.. అసౌకర్యాన్ని కల్గిస్తుంది. ప్రోటీన్ ఆహారాలు భోజనంతోపాటు తీసుకుంటే.. బరువుగా..పొట్ట ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. భోజనంలో గుడ్లు, పంది మాంసం, హామ్ తినడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. కూల్ డ్రింక్స్‏తో జున్ను కలిపి తీసుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యం సేవించినప్పుడు పొరపాటున స్వీట్లు తినకూడదు. ఇవి శరీరంలో కొవ్వును పెంచుతుంది. మద్యంతో స్వీట్లకు బదులుగా పచ్చి కూరగాయలను తీసుకోవడం మంచిది.

Also Read: Hamsa Nandini: క్యాన్సర్‏తో పోరాటం చేస్తోన్న హీరోయిన్.. సర్జరీలకు సమయం వచ్చేసిందంటూ పోస్ట్..

Mahesh Babu: మహేష్‏తో తలపడనున్న తమిళ్ స్టార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‏కు త్రివిక్రమ్ అదిరిపోయే ట్రీట్..

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Viral Video: ఇదేక్కడి తెలివిరా బాబు.. ఫోన్ దొంగిలించాడు.. చివరకు ఊహించని షాక్..