AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేక్కడి తెలివిరా బాబు.. ఫోన్ దొంగిలించాడు.. చివరకు ఊహించని షాక్..

దొంగతనం చేయడం కూడా ఒక ఆర్ట్ అని అంటుంటారు. ఏదైనా వస్తువులు.. నగలు.. డబ్బు దొంగిలించడం అంత సులువైన పని కాదు.. దొంగతనం చేయడానికి దొంగలు చాలా కష్టపడుతుంటారు.

Viral Video: ఇదేక్కడి తెలివిరా బాబు.. ఫోన్ దొంగిలించాడు.. చివరకు ఊహించని షాక్..
Viral
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2022 | 5:03 PM

Share

దొంగతనం చేయడం కూడా ఒక ఆర్ట్ అని అంటుంటారు. ఏదైనా వస్తువులు.. నగలు.. డబ్బు దొంగిలించడం అంత సులువైన పని కాదు.. దొంగతనం చేయడానికి దొంగలు చాలా కష్టపడుతుంటారు. అయితే చిన్న చిన్న పోరపాట్లు చేయడం వలన దొంగలను సులువుగా పట్టేస్తుంటారు పోలీసులు. కానీ కొన్నిసార్లు.. దొంగలను పట్టుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతుంది. ఇటీవల దొంగలను పట్టుకోవడానికి పోలీసులకు సీసీ కెమెరాలను ప్రధాన ఆయుధంగా మారాయి. దొంగ ఎవరో కనిపెట్టడానికి సీసీ ఫుటేజ్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఇటీవల దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నారు. అందులో కొన్నింటిని చూస్తే.. దొంగతనం ఇలా కూడా చేస్తారా అనే సందేహాలు రాకమానవు. అలాగే.. కొన్ని షాకింగ్‏గా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. ఆ దొంగ అతి తెలివి చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

ఆ వీడియో.. ఓ రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి ఓ వ్యక్తి నిల్చున్నాడు. అతను ఒక చెతిలో డబ్బులు పట్టుకుని మరో చేతితో ఫోన్ మాట్లాడుతున్నాడు. కాసేపటి తర్వాత అక్కడికి ఓ యువకుడు వచ్చి బైక్ పార్క్ చేసి తలకు హెల్మెట్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి పక్కకు వచ్చి నిల్చున్నాడు. అలా కాసేపు నిల్చున్న తర్వాత.. ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడం చూసి వెంటనే పక్కనే ఉన్న వ్యక్తి చేతిలోని డబ్బు తీసుకుని పరిగెత్తాడు. డబ్బు దొంగిలించి బైక్ పై పరిగెత్తాలనుకున్నాడు.. కానీ బైక్ స్టార్ట్ కాకపోవడంతో.. కాళ్లకు పని చెప్పాడు. ఆ దొంగను వెంబడించిన వ్యక్తి… తిరిగి వచ్చి ఆ బైక్ తీసుకుని చక్కా పోయాడు. కాసేపటి తర్వాత ఆ దొంగ వచ్చి బైక్ చూసి కంగుతిన్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఇదెక్కడి తెలివిరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన ఈ అందాలతార ఎవరో గుర్తుపట్టారా?.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు మనకు దూరమైంది..

Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్‌ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..