Bheemla Nayak: పవర్ స్టార్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’(Bheemla Nayak) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bheemla Nayak Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’(Bheemla Nayak) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులను నిరుత్సాహ పరుస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలిచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అదేవిధంగా సినిమా టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని పేర్కొంది. థియేటర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించేలా రెవెన్యూ అధికారుల నిఘా పెట్టాలని సూచించింది. నిబంధనలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో వెల్లడించింది. ఈమేరకు అన్ని జిల్లాల్లోని తహసీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘భీమ్లానాయక్’ ఐదో ఆటకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోనూ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ‘వకీల్‌సాబ్’ లాంటి హిట్ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘భీమ్లానాయక్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తుండడం సినిమాకు అదనపు ఆకర్షణ. నల్గొండకు చెందిన సాగర్ కే. చంద్ర ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల సహకారం అందించారు. తమన్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. మరి రేపు విడుదల కానున్న ఈ భీమ్లానాయక్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
Also Read: UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..
Watermelon: సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. పుచ్చకాయతో అదిరిపోయే ప్రయోజనాలు
Watermelon: సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. పుచ్చకాయతో అదిరిపోయే ప్రయోజనాలు