KTR: మేమంతా ‘తొలిప్రేమ’ సినిమా చూసిన వాళ్లమే.. భీమ్లా నాయక్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో కేటీఆర్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Bheemla Nayak Pre Release Event : పవన్ కల్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కిన 'భీమ్లానాయక్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక హైదరాబాద్‌లోని యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ఘనంగా జరిగింది

KTR: మేమంతా 'తొలిప్రేమ' సినిమా చూసిన వాళ్లమే.. భీమ్లా నాయక్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో కేటీఆర్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Ktr
Basha Shek

|

Feb 24, 2022 | 6:02 AM

Bheemla Nayak Pre Release Event : పవన్ కల్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కిన ‘భీమ్లానాయక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక హైదరాబాద్‌లోని యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘నేను మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడకు రాలేదు. పవన్‌కల్యాణ్‌కు ఒక సోదరుడిలా వచ్చాను. సూపర్‌స్టార్‌లు, సినిమాస్టార్‌లు ఎందరున్నా కల్ట్ ఫాలోయింగ్‌ ఉన్న విలక్షణ నటుడు పవన్‌ కల్యాణ్‌. మేమంతా ఆయన నటించిన తొలిప్రేమ సినిమా చూసిన వాళ్లమే. అప్పటి నుండి సుమారు 26 ఏళ్ల పాటు ఒకే రకమైన స్టార్‌ డమ్‌ను కలిగి ఉండడమంటే సాధారణ విషయం కాదు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఎనిమిదేళ్లుగా భారతీయ చిత్రపరిశ్రమకు హబ్‌గా హైదరాబాద్‌ మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజుకాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కి కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్‌‌గారిని కోరుతున్నా.. సినిమా షూటింగ్స్ కేవలం గోదావరి జిల్లాలలోనే కాదు మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లో కూడా చేసుకోవచ్చు. మీరు షూటింగ్స్ చేసి, మన తెలంగాణ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇక ‘భీమ్లానాయక్‌’ సినిమా ద్వారా మొగిలయ్య, దుర్గవ్వ లాంటి అజ్ఞత సూర్యులను వెలుగులోకి తీసుకొచ్చినందుకు పవన్ కల్యాణ్ గారికి, చిత్రయూనిట్‌కి అభినందనలు’ అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

భీమ్లానాయక్‌ బ్రహ్మాండంగా ఆడాలి..
ఇక మరో ముఖ్య అతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ’ ఇండస్ట్రీ బాగుండాలి.. సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలనే మేం కోరుకుంటున్నాం. 24 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ గారికి క్రేజ్ పెరుగుతుందే తప్ప.. ఎక్కడా తగ్గడం లేదు. వారిని చూస్తుంటే వయసు పెరుగుతుందా? తగ్గుతుందా? అనే అనుమానం వస్తుంటుంది. వారికి అభినందనలు తెలియజేస్తూ.. ‘భీమ్లా నాయక్’ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న కళాకారులను గుర్తించి వారికి అవకాశం అందించిన పవన్‌కు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు.

Also Read:Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

TDP: సామాన్యులకు శ్రీవారిని దూరం చేస్తున్నారు.. టీటీడీ పాలక మండలి తీరుపై పయ్యావుల విమర్శలు..

Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu