TDP: సామాన్యులకు శ్రీవారిని దూరం చేస్తున్నారు.. టీటీడీ పాలక మండలి తీరుపై పయ్యావుల విమర్శలు..

సామాన్య భక్తులకు తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామిని దూరం చేసే కుట్ర జరుగుతోందని టీడీపీ(TDP) నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ఆందోళన వ్యక్తం చేశారు.

TDP: సామాన్యులకు శ్రీవారిని దూరం చేస్తున్నారు.. టీటీడీ పాలక మండలి తీరుపై పయ్యావుల విమర్శలు..
Payyavula Keshav
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 23, 2022 | 10:53 PM

సామాన్య భక్తులకు తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామిని దూరం చేసే కుట్ర జరుగుతోందని టీడీపీ(TDP) నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించేలా ఉంటున్నాయని మండిపడ్డారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే తిరుమలను వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు మొత్తం వ్యాపారవేత్తలతో నిండిపోయిందని.. టీటీడీ బోర్డు మీటింగ్ వేలం పాటలా సాగిందని విమర్శించారు. బోర్డు సమావేశంలో ధరలను పెంచడం.. సామాన్యులకు స్వామిని దూరం చేయడమేనని కామెంట్ చేశారు. దేశంలో  కోవిడ్ ఆంక్షలు ఎక్కడా లేకపోయినా.. తిరుమలలో ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. టిక్కెట్ లేకపోతే తిరుపతి నుంచి తిరుమలకు పంపించడం లేదన్నారు.

టీటీడీ విధిస్తున్న నిబంధనలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని పయ్యావుల ప్రశ్నించారు. మీరు ఏ దేవుడిని పూజించుకున్నా తమకు అభ్యంతరం లేదని… కానీ, తమ దేవుడిని తమకు దూరం చేయవద్దని అన్నారు. అందరికీ సమాన దర్శనం, సమాన వసతి లేనప్పుడు సమాన భోజనం ఎందుకని అడిగారు.

ఇవి కూడా చదవండి: Chicken Changezi Recipe: చికెన్ ఇలా వండితే.. మొత్తం మీరే తినేస్తారు.. ఎలా చేయాలో నేర్చుకోండి..

Viral Video: కచోడీ కొనేందుకు ట్రైన్​ఆపిన డ్రైవర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..