AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో మూడూ ముక్కలాట.. ఇంతకీ దేనికోసమో తెలుసా?

Telangana Politics: ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట సాగుతోంది. నియోజకవర్గ టికెట్ నీకా నాకా అంటూ నేతల ప్రయత్నాలు పులి జూదాన్ని తలపిస్తున్నాయి.

Telangana Politics: ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో మూడూ ముక్కలాట.. ఇంతకీ దేనికోసమో తెలుసా?
Congress Party
Shiva Prajapati
|

Updated on: Feb 23, 2022 | 9:51 PM

Share

Telangana Politics: ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట సాగుతోంది. నియోజకవర్గ టికెట్ నీకా నాకా అంటూ నేతల ప్రయత్నాలు పులి జూదాన్ని తలపిస్తున్నాయి. ఒకరేమో గతంలో పోటీ చేశానని అంటుంటే.. మరొకరేమో నేను సీనియర్‌ని అంటున్నారు. ఇంకొకరేమో మహిళా కోట అని చెబుతున్నారు. ఇలా నేతలు చేస్తున్న ప్రకటనలు పార్టీ క్యాడర్‌ను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నాయి. మరి ఇంతకీ ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికి దక్కుతుంది?

ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్‌కి ఒకప్పటి కంచుకోట. పిజెర్ ఉన్నపుడు గానీ దానం నాగేందర్ ఉన్నప్పుడు సైతం ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మధ్యలో ఒక్కసారి రామ చంద్ర రెడ్డి బీజేపీ నుండి గెలిచినా.. దానం నాగేందర్ కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులు అక్కడ కాంగ్రెస్ బలంగా ఉనికి చాటుకుంటూ వచ్చింది. అయితే దానం కాంగ్రెస్‌ని వీడి కారెక్కాక కాంగ్రెస్ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేని దుస్థితికి నెట్టబడింది.

అయితే 2018 ఎన్నికల్లో ఉత్తమకుమార్ రెడ్డి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్‌కి టికెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేయడం దాసోజుకి ఇష్టం లేకున్నా.. ఆఖరి నిముషంలో టికెట్ దక్కడంతో పోటీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో బీ ఫామ్ తీసుకొని ఖైరతాబాద్‌లో కాలు పెట్టెశారు. అయితే, దాసోజుకి ఖైరతాబాద్‌పై ఎలాంటి అవగాహన లేదని ఎలాగో అలా ప్రచారంలో దిగి పోరాటం చేసినప్పటికీ.. దానం నాగేందర్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఆ నిజయోజక వర్గాన్ని దాసోజు పట్టుకొని ఉన్నపటికీ అక్కడ కనీస స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయలేకపోయారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక అదే నియోజకవర్గానికి చేందిన డాక్టర్ రోహిన్ రెడ్డి పేరు సడెన్‌గా తెర మీదికి వచ్చింది. రేవంత్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే రోహిన్.. ఈసారి టికెట్ నాదే అంటున్నారు. నిజయోజకవర్గంలో స్థానికుడినైన తాను ఎప్పటి నుంచో టికెట్ రేసులో ఉన్నా.. అవకాశం దక్కలేదని చెబుతున్నారు. దానం నాగందర్.. పార్టీలో సీనియర్‌గా ఉన్నారు కాబట్టి అప్పట్లో తనకు టికెట్ దక్కలేదని, 2018లో తనకు టికెట్ దక్కాల్సి ఉన్నపటికీ ఉత్తమ్ సపోర్ట్ చేయకపోవడంతో టికెట్ దక్కలేదని చెప్తున్నారు. అంతేకాదు.. జానా రెడ్డి ఆశీసులు సైతం తనకే ఉన్నాయని అంటున్న రోహిన్ రెడ్డి.. ఈసారి టిక్కెట్ పక్కా నాకే అని ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక రోహిన్ రెడ్డి ఎంట్రీతో దాసోజు శ్రవణ్ ఇరకాటంలో పడ్డారు. రోహిన్ ప్రాధాన్యతపై దాసోజు కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరి ఫైట్ ఇలా ఉంటే అదే నిజయోజకవర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు సైతం తాను కూడా రేసులో ఉన్నానంటూ చెప్పుకుంటున్నారు. మహిళా కాంగ్రెస్ కోటలో ఈ సారి ఖైరతాబాద్ టికెట్ తనదే అనే ధీమా సునీత రావ్ మాటల్లో వ్యక్తం అవుతుంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో టిక్కెట్ లొల్లి మూడు ముక్కలాటను తలపిస్తుంది ఈ ముగ్గురిలో హై కమాండ్ ఛాయిస్ ఎవరనేది చూడాలి మరి.

Also read:

Virat Kohli: విరాట్ కోహ్లీ మెంటల్ హెల్త్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ ఆందోళన.. ఎందుకంటే?

Elbow: మోచేయికి దెబ్బ తగిలినప్పుడు కరెంట్ షాక్‌లా ఎందుకు ఉంటుంది..? కారణం ఏమిటి?

Russia Ukraine Crisis: ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకు వస్తావా.. రష్యా-ఉక్రెయిన్ వివాదంలో భారత్ పరిస్థితి ఇది..