AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీ మెంటల్ హెల్త్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ ఆందోళన.. ఎందుకంటే?

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన టెస్ట్ సెంచరీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఫాంలేమితో పోరాడుతున్నాడు. అభిమానులు కూడా రెండేళ్లుగా విరాట్ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ మెంటల్ హెల్త్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ ఆందోళన.. ఎందుకంటే?
Virat Kohli
Venkata Chari
| Edited By: |

Updated on: Apr 28, 2022 | 5:34 PM

Share

Indian Cricket Team: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) తన టెస్ట్ సెంచరీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఫాంలేమితో పోరాడుతున్నాడు. అభిమానులు కూడా రెండేళ్లుగా విరాట్ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమేరకు ఒకప్పటి భారత బ్యాట్స్‌మెన్, IPL విజేత చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్లేయర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 33 ఏళ్ల కోహ్లి 27 టెస్టు సెంచరీలు చేశాడు. నవంబర్ 2019 నుంచి రెడ్-బాల్ క్రికెట్‌లో 15 మ్యాచ్‌లు, 27 ఇన్నింగ్స్‌లు ఆడినా మూడు అంకెలను చేరుకోలేకపోతున్నాడు. చివరిసారిగా 2019 చివరిలో బంగ్లాదేశ్‌పై 136 పరుగులు చేశాడు. ఆ తరువాత ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలో, కోహ్లీ 70 ఇన్నింగ్స్‌లలో 24 అర్ధ సెంచరీలతో 38.04 సగటును కలిగి ఉన్నాడు. 2021లో ఐదుసార్లు అతను స్కోర్ చేయకుండానే ఔటయ్యాడు. ఈ ఏడాది పది అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ సగటు 31.90గా మారింది. దీంతో కోహ్లీ ఫాంపై ఆందోళన రేకెత్తింది. ఈ దశలో, ఆఫ్‌స్టంప్ వెలుపల డ్రైవ్‌లను వెంటాడుతూ పెవిలియన్ చేరడం ఇబ్బందిగా మారింది. అయితే వైట్-బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 10 సార్లు స్పిన్నర్లకు తలొగ్గాడు.

నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి T20I కెప్టెన్సీని వదులుకున్నాడు. డిసెంబర్‌లో ODI కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించారు. అయితే బీసీసీఐతో విభేదాలతోనే కెప్టెన్సీని వదులుకున్నాడని వార్తలు వచ్చాయి. ఈ మధ్యలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతోనూ విభేదాలు వచ్చినట్లు రూమర్స్ వచ్చాయి. దక్షిణాఫ్రికాలో 1-2తో సిరీస్ ఓటమి తర్వాత, కోహ్లి భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

భారత మాజీ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకున్నాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు ముందు నాలుగు T20Iలకు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. రెండున్నర సంవత్సరాలుగా దూరమవుతున్న సెంచరీని, ఈ సిరీస్‌లో సాధించేందుకు బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ, “ ఈ సిరీస్‌లో కోహ్లీ తిరిగి తన పాత ఫాంలోకి వస్తాడు. అలాగే సెంచరీల కరువును కూడా తీర్చుకుంటాడు. ఆటగాళ్లకు ఇలాంటి దశను ఎప్పుడోకప్పుడు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆటగాళ్లకు మానసిక స్థైర్యం చాలా ఎక్కువగా ఉండాలి. బ్యా్గ్ ఫాంలో ఉన్నప్పుడు, ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది”అని పేర్కొన్నాడు.

2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో 10 ఇన్నింగ్స్‌లలో 13.40 సగటుతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కోహ్లీ, దాని నుంచి ఎలా పోరాడి, బయటకు వచ్చాడో తనే స్వయంగా వివరించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి శ్రీలంకతో జరగబోయే టీ20ఐ సిరీస్‌కు దూరమవుతాడనే ఊహగానాలు వచ్చాయి. అయితే వీటిని నిజం చేస్తూ శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది ప్రస్తుతం అతని మానసిక స్థితిపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఉతప్ప ప్రకారం, ఇతర దేశాలలో కాకుండా, క్రికెట్ క్రీడపై ఎక్కువ ఆసక్తి చూపే భారతదేశంలో కోహ్లీ వంటి సూపర్ స్టార్ అయితే తప్ప విరామం ఎంపిక సరైనది కాదు. అభద్రతతో పోరాడుతున్న ఆటగాళ్లు ఎంతో ఒత్తిడిని కలిగి ఉంటారు. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉతప్ప కోరాడు.

భారత జట్టులో స్థానం నిలబెట్టుకోవడం కంటే జట్టులోకి రావడం సులభం.. 54 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో 1183 పరుగులు చేసిన ఉతప్ప మాట్లాడుతూ, ఒక స్థానాన్ని కాపాడుకోవడం కంటే లుక్-ఇన్ పొందడం చాలా సులభమని పేర్కొన్నాడు. “మానసిక ఆరోగ్య కారణాల వల్ల విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న బెన్ స్టోక్స్ లాంటి వారు భారతదేశంలో ఉన్నట్లయితే, పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. ఇక్కడ చాలా పోటీ ఉంది. ఇది అత్యంత స్వీయ-ప్రేరేపిత వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఆటలో స్వచ్ఛతను కనుగొనడం కష్టం’ అని పేర్కొన్నాడు.

“భారత క్రికెట్ విషయానికొస్తే, అనూహ్యంగా ప్రతిభావంతులైన క్రికెటర్ల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి వారి విలువ ఎప్పుడూ తక్కువగా ఉంటుంది” అని కోహ్లీ తెలిపాడు. “బాలీవుడ్ లాగా, క్రికెట్ పరిశ్రమ బహుశా అత్యంత అసురక్షితమైన వాటిలో ఒకటి. ఎందుకంటే నేడు అది కేవలం ప్రదర్శనల గురించి మాత్రమే కాదు; ఇది వాణిజ్య ఉత్పత్తిగా మారింది. ఎంతకు అమ్ముడవుతారు, సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఎంత, సోషల్ మీడియాలో పరస్పర చర్యలు ఎలా ఉంటాయనే దానిపై ఆధారపడి ఉంది. ఇది క్రికెట్‌కు పూర్తిగా అసంబద్ధమైన విషయాలు.. ఇప్పటికీ ఆటతో సంబంధం కలిగి ఉంటాయి. ఒక కమర్షియల్ ఉత్పత్తిగా కంపెనీలకు మీరు ఎంత లాభదాయకంగా ఉన్నారో తెలిస్తేనే మీ కెరీర్ అలా సాగిపోతుంది” అని పేర్కొన్నాడు.

Also Read: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జతకట్టిన టీమిండియా మాజీ బౌలర్..!

IND vs SL: శ్రీలంక టీంకు భారీ ఎదురుదెబ్బ.. కరోనా బారిన కీలక ఆటగాడు.. టీ20 సిరీస్ నుంచి ఔట్..!