IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జతకట్టిన టీమిండియా మాజీ బౌలర్..!

Ajit Agarkar: ఢిల్లీ క్యాపిటల్స్ టీం భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది. అసిస్టెంట్ కోచ్‌గా కొత్త పాత్రలో ఐపీఎల్ 2022లో కనిపించనున్నాడు.

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జతకట్టిన  టీమిండియా మాజీ బౌలర్..!
Ajit Agarkar
Follow us
Venkata Chari

|

Updated on: Feb 23, 2022 | 8:54 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar ) బుధవారం అధికారికంగా నియమితులయ్యారు. గురువారం నుంచి శ్రీలంకతో భారత్(Ind vs Sl) స్వదేశంలో జరగనున్న సిరీస్‌కు వ్యాఖ్యానం పూర్తి చేసిన తర్వాత అతను జట్టులో చేరనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరిన తర్వాత, అగార్కర్ మాట్లాడుతూ, “ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమైనందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ఖచ్చితంగా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన రిషబ్ పంత్ నేతృత్వంలోని అద్భుతమైన జట్టు మాకు ఉంది” అని చెప్పుకొచ్చాడు.

“కోచ్ రికీ పాంటింగ్ ఆటలో గొప్ప ఆటగాడు. నేను అతనితో పని చేయడానికి ఎదురుచూస్తున్నాను” అని పేర్కన్నాడు. అగార్కర్ (44 ఏళ్లు) భారత్ తరఫున 288 వన్డే, 58 టెస్టు వికెట్లు తీశాడు. అతను పాంటింగ్, ప్రవీణ్ ఆమ్రే (సహాయ కోచ్), జేమ్స్ హోప్స్ (బౌలింగ్ కోచ్)లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో చేరనున్నాడు. అగార్కర్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

అజిత్ అగార్కర్ టీమ్ ఇండియా తరఫున 191 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 288 వికెట్లు తీశాడు. 26 టెస్టుల్లో 58 వికెట్లు తీశాడు. దీంతో పాటు 4 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అగార్కర్ 42 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 29 వికెట్లు తీశాడు.

Also Read: Watch Photo: హెయిర్ స్టైల్ మార్చిన టీమిండియా ఓపెనర్.. ఐపీఎల్‌ కోసమే అంటోన్న ఫ్యాన్స్..

IND vs SL: శ్రీలంక టీంకు భారీ ఎదురుదెబ్బ.. కరోనా బారిన కీలక ఆటగాడు.. టీ20 సిరీస్ నుంచి ఔట్..!