Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన ఈ అందాలతార ఎవరో గుర్తుపట్టారా?.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు మనకు దూరమైంది..

నెత్తిన పూలు, కళ్ల నిండా కాటుక పెట్టుకుని ఎంతో క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఒకప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో టాప్‌ హీరోయిన్‌. బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. 

భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన ఈ అందాలతార ఎవరో గుర్తుపట్టారా?.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు మనకు దూరమైంది..
Actress
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Feb 24, 2022 | 9:33 AM

నెత్తిన పూలు, కళ్ల నిండా కాటుక పెట్టుకుని ఎంతో క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఒకప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో టాప్‌ హీరోయిన్‌. బాలనటిగా వెండితెరకు పరిచయమైంది.  ఆతర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి భారత సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. తెలుగులో తెర తొలిత‌రం స్టార్స్ ఎన్టీఆర్​, ఏఎన్నార్​ లాంటి వాళ్లతోనే కాదు చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున లాంటి నిన్నటితరం హీరోల పక్కన ఆడిపాడింది. తన అందం, అభినయంతో అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. అభిమానుల చేత ఆరాధ్య దేవత, అతిలోక సుందరి అనిపించుకుంది. అంతలా ప్రేక్షుకుల మ‌న‌సుల్లో శాశ్వతంగా గూడు క‌ట్టుకున్న ఆమె నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఈ రోజే అనూహ్యంగా ఈ లోకం నుంచి విడిచివెళ్లిపోయింది. ఆమె మరెవరో కాదు అందాల తార శ్రీదేవి.

ఫిబ్రవరి 24, 2018న దుబాయ్ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో విద్యుదఘాతానికి గురైన శ్రీదేవి 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మరణం కుటుంబం, స్నేహితులతో పాటు కోట్లాది మంది అభిమాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మనల్ని విడిచిపోయి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఆమె లేని లోటును తీర్చడానికి ఆమె కూతుళ్లు జాన్వీకపూర్‌, ఖుషి కపూర్‌ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ తన అందం, అభినయంతో శ్రీదేవి వారసురాలిగా పేరు తెచ్చుకుంటోంది. ధడక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె గుంజన్‌ సక్సేనాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రూహీ, ఘోస్ట్‌ స్టోరీస్‌ లోనూ ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం జాన్వీ చేతిలో దోస్తానా 2, గుడ్ లక్‌ జెర్రీ, మిల్లీ అనే సినిమాలు ఉన్నాయి.

Sridevi

Sridevi