Mahesh Babu: మహేష్‏తో తలపడనున్న తమిళ్ స్టార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‏కు త్రివిక్రమ్ అదిరిపోయే ట్రీట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది.

Mahesh Babu: మహేష్‏తో తలపడనున్న తమిళ్ స్టార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‏కు త్రివిక్రమ్ అదిరిపోయే ట్రీట్..
Mahesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 24, 2022 | 3:15 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ స్టైలీష్ లుక్‏లో కనిపించనుండడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. సర్కారు వారి పాట విడుదల కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, వీడియోస్ సర్కారు వారి పాట చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో చిత్రాలు చేయనున్నారు.

ఇందులో మొదటిగా త్రివిక్రమ్ సినిమాను పూర్తిచేయనున్నారు. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక మరోసారి ఇందులో మహేష్‏కు జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. అంతేకాకుండా.. ఇందులో మహేష్ పిన్ని పాత్రలో సీనియర్ నటి శోభన నటించనున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇందులో విలన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటించనున్నారట. ఈ పాత్రకు ఆయన అయితేనే బాగుంటాడనే ఉద్దేశంతో చిత్రయూనిట్ ఆయనను సంప్రదిస్తున్నారని.. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.

Also Read: Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన ఈ అందాలతార ఎవరో గుర్తుపట్టారా?.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు మనకు దూరమైంది..

Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్‌ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!