Vastu Tips: ఇంట్లో పక్షుల్ని పెంచుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..
ఇంట్లో పెట్స్ పెంచుకునే అలవాటు చాలా మందికి ఉంది. చాలా మంది పెంచుకుంటున్నారు కూడా. కుక్కలు, పిల్లలు, చేపలు, పక్షులు ఇలా వారికి ఇష్టమైన వాటిని పెంచుకుంటూ ఉంటారు. అయితే పక్షులు పారిపోతాయని భయంతో వీటిని పంజరాల్లో పెట్టి వాటిని పెట్టి చూసుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో పక్షుల్ని పెంచుకోవచ్చా? పంజరాల్లో వాటిని బంధించవచ్చా? ఇలా పంజరాల్లో పెట్టడం వల్ల మనకు ఎలాంటి నష్టం కలుగుతుంది? ముఖ్యంగా రామ చిలుకను ఇంట్లో..
ఇంట్లో పెట్స్ పెంచుకునే అలవాటు చాలా మందికి ఉంది. చాలా మంది పెంచుకుంటున్నారు కూడా. కుక్కలు, పిల్లలు, చేపలు, పక్షులు ఇలా వారికి ఇష్టమైన వాటిని పెంచుకుంటూ ఉంటారు. అయితే పక్షులు పారిపోతాయని భయంతో వీటిని పంజరాల్లో పెట్టి వాటిని పెట్టి చూసుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో పక్షుల్ని పెంచుకోవచ్చా? పంజరాల్లో వాటిని బంధించవచ్చా? ఇలా పంజరాల్లో పెట్టడం వల్ల మనకు ఎలాంటి నష్టం కలుగుతుంది? ముఖ్యంగా రామ చిలుకను ఇంట్లో పెంచుకోవచ్చా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతున్నాయి? వీటి వల్ల మనకు మంచి జరుగుతుందా? లేక చెడు జరుగుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
రామ చిలుక..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో రామ చిలుకను పెంచుకోవడం చాలా మంచిది. శుభ పరిణామంగా చెబుతారు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందులోనూ మంటలు చెప్పే చిలుకలు అయితే.. ఇంట్లో మరింత సంతోషాన్ని పెంచుదని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఏ దిక్కులో పెంచుకోవాలి..
ఇంట్లో పక్షుల్ని పెంచుకోవడానికి తూర్పు దిక్కు చాలా శుభప్రదం. ఉత్తర దిశ కూడా అనుకూలమే. ఈ దిశలో చిలుకలను పెంచుకోవడం వల్ల పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. అలాగే ఇంట్లో సానుకూల శక్తి నెలకుంటుంది. అలాగే తూర్పు దిశ.. సూర్య భగవానుడి దిశగా పరిగణిస్తారు. ఇది శక్తి, విజానికి చిహ్నంగా చెబుతారు. ఇంట్లో శ్రేయస్సు, ఆనందం కలుగుతాయి.
ఈ దిశల్లో పక్షులను ఉంచకపోవడం మంచిది..
వాస్తు శాస్త్రం ప్రకారం పక్షులను పడమర లేదా దక్షిణం దిక్కుల్లో అస్సలు పెంచకపోవడమే మంచిది. ఎందుకంటే దక్షిణ దిశ యమరాజు దిశగా చెప్తారు. అలాగే పశ్చిమ దిక్కు రాహుగ్రహం దిశగా పరిగణిస్తారు. వీటి వలన ఇంట్లో అశాంతి, సమస్యలు పెరుగుతాయి.
సంతోషంగా ఉండేలా చూసుకోండి:
పక్షులను పంజరంలో పెంచుకుంటే ఎలాంటి దోషం లేదు. అయితే ఈ పక్షులు సంతోషంగా ఉండేలా చూసుకోండి. పక్షులు సంతోషంగా లేకపోతే ఇంట్లో సైడ్ ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.