AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: గణపతి, కార్తికేయుడు మాత్రమే కాదు శివుడికి కూడా ఇతర సంతానం ఉందని తెలుసా..!

శివుడికి వీరిద్దరు మాత్రమే కాదు.. ఇంకా సంతానం ఉంది. వీరి గురించి చాలా అరుదుగా ప్రస్తావిస్తారు. అంతేకాదు వీరి జననాకి సంబంధించిన సంబంధించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. శివుని సంతానంగా భావించే ఈ దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా దేశంలో ఉన్నాయి. ఈ ప్రసిద్ధి దేవాలయాల ప్రస్తావన పురాణాల్లో ఉన్నాయి. పురాణాల ప్రకారం శివయ్య 8 మంది పిల్లలకు తండ్రి. ఈ రోజు వినాయకుడు, కార్తికేయుడు కాకుండా మరికొందరు శివుని సంతానం గురించి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Lord Shiva: గణపతి, కార్తికేయుడు మాత్రమే కాదు శివుడికి కూడా ఇతర సంతానం ఉందని తెలుసా..!
Lord Shiva Children
Surya Kala
|

Updated on: Jun 05, 2024 | 1:18 PM

Share

త్రిమూర్తులలో లయకారుడు శివుడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. లోకానికి శివపార్వతులను ఆదిదంపతులు అని అంటారు. ఈ దంపతులకు విఘ్నాలకధిపతి వినాయకుడు, శౌర్య అద్వితీయ పరాక్రముడు అనే ఇద్దరు సంతానం అని అందరికి తెలిసిందే. అయితే శివుడికి వీరిద్దరు మాత్రమే కాదు.. ఇంకా సంతానం ఉంది. వీరి గురించి చాలా అరుదుగా ప్రస్తావిస్తారు. అంతేకాదు వీరి జననాకి సంబంధించిన సంబంధించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. శివుని సంతానంగా భావించే ఈ దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా దేశంలో ఉన్నాయి. ఈ ప్రసిద్ధి దేవాలయాల ప్రస్తావన పురాణాల్లో ఉన్నాయి. పురాణాల ప్రకారం శివయ్య 8 మంది పిల్లలకు తండ్రి. ఈ రోజు వినాయకుడు, కార్తికేయుడు కాకుండా మరికొందరు శివుని సంతానం గురించి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

శివుని కుమార్తె.. అశోక్ సుందరి

అశోక సుందరి ఆది దంపతులైన శివపార్వతుల కుమార్తె.. ఈమె గురించి శివ పురాణం, పద్మ పురాణంలో ప్రస్తావన ఉంది. కార్తికేయుడి జననం తర్వాత అశోక సుందరి పుట్టింది. పురాణాల ప్రకారం.. పార్వతి దేవి తన ఒంటరితనాన్ని అధిగమించాలని కోరుకుంది.అప్పుడు తనకు ఒక కూతురు ఉంటే అని భావించింది. అప్పుడు పార్వతి దేవి కల్పవృక్షాన్ని ప్రార్ధించి కుమార్తెను వరంగా కోరింది. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఇచ్చిన వరంతో పార్వతిదేవికి కుమార్తె లభించింది. కల్పవృక్షం నుండి అశోక సుందరి సృష్టించబడింది. అశోక సుందరిని ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాలా త్రిపురసుందరి రూపంలో పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

మానసా దేవి

పురాణ నమ్మకాల ప్రకారం మానస దేవి శివుని చిన్న కుమార్తె అని కూడా చెబుతారు. వాసుకి అని కూడా పిలుస్తారు. శివపురాణంలో మానసా దేవి పార్వతీ దేవి అసూయతో ముడిపడి ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మానసా దేవి తల నుండి ఉద్భవించింది. అందుకే ఆమె పార్వతి కుమార్తె కాదు. మానస దేవి ప్రసిద్ధ శక్తిపీఠం హరిద్వార్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లో ప్రధానంగా పాముకాటు నివారణ కోసం, సంతానోత్పత్తి, శ్రేయస్సు కోసం పూజిస్తారు

అయ్యప్ప స్వామి

హరిహర తనయుడు అయ్యప్ప స్వామి ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవతగా పూజించబడుతున్నాడు. అయ్యప్ప స్వామికి తండ్రిగా శివుడిని భావిస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి సముద్ర మథనం సమయంలో విష్ణువు మోహినీ రూపాన్ని ధరించినప్పుడు.. శివుడు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. హరిహరుల నుండి అయ్యప్ప జన్మించాడు.

అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు అని పూజిస్తారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా సహా దక్షినాదిలో పూజించబడే అత్యంత శక్తివంతమైన దేవుడిగా పరిగణించబడుతుంది. అయ్యప్పకు అంకితం చేయబడిన శబరిమల ఆలయం కేరళలోని చాలా ప్రసిద్ధ ఆలయం. పరశురాముడితో యుద్ధం చేయగల ఏకైక దేవుడు అయ్యప్ప అని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు