AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahoblilam: వైభవంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మత్సవాలు.. వైభవంగా సాగిన స్వామివారి కల్యాణోత్సవం..

విశేష అలంకరణలతో స్వామి గజవాహనంపై కొలువుదీరి ఆలయ పురవీధుల్లో వివరించారు. స్వామి అమ్మవారికి రత్నాలు వజ్రాలతో పొదిగిన ఆభరణాలను అలంకరించారు అర్చకులు. ఎదురుకోళ్లు తీసుకొని నృత్యం చేస్తూ స్వామివారికి సమర్పించారు.

Ahoblilam: వైభవంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మత్సవాలు.. వైభవంగా సాగిన స్వామివారి కల్యాణోత్సవం..
Ahobilam
Surya Kala
|

Updated on: Mar 06, 2023 | 5:52 PM

Share

నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో  శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ప్రహ్లాద వరద స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది, బ్రహ్మోత్సవాలు ముఖ్యమైన స్వామి కళ్యాణోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా సాగింది ఉదయం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృతాల, క్షీరము లతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం విశేష అలంకరణలతో స్వామి గజవాహనంపై కొలువుదీరి ఆలయ పురవీధుల్లో వివరించారు రాత్రి స్వామి అమ్మవారికి రత్నాలు వజ్రాలతో పొదిగిన ఆభరణాలను అలంకరించారు అర్చకులు ఎదురుకోళ్లు తీసుకొని నృత్యం చేస్తూ స్వామివారికి సమర్పించారు. కళ్యాణోత్సవంలో భాగంగా  మంగళవాయిద్యాలు, భాజాభజంత్రీల మధ్య మాంగళ్య ధారణ జరిగింది. అర్చకులు వధూవరులపై తలంబ్రాలు పోసే దృశ్యం భక్తులకు కనువిందు కలిగించింది.

కళ్యాణోత్సవ వేడుకలను పురష్కరించుకుని వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టువస్త్రాలను అందజేశారు.  . అమ్మవారిని తమ కూతురుగా భావించే పద్మశాలీయులు అమ్మవారికి కల్యాణికి పట్టు చీరెను సమర్పించారు. కళ్యాణాన్ని స్త్రీ సూక్తం, పురుషసూక్తంతో శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు.కళ్యాణోత్సవం అనంతరం భక్తులు చదివింపులు చదివించారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీవన్ శతగోప శ్రీ రంగనాథ యాతేంద్ర మహాదేశిక స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు , కూచిపూడి నృత్యం భక్తులను అలరించాయి.

Reporter : Nagi Reddy, Tv9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..