AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ 12 వాస్తు మార్పులు చేసుకుంటే మీ బంగారు భవితకు బాటలు.. జీవితంలో ఆర్థికంగా స్థిరపడుతారు..

Vastu Tips in Telugu: మనం చేసేది చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే జీవితంలో ఆదాయపరంగా స్థిరపడటానికి, పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది. 

Vastu Tips: ఈ 12 వాస్తు మార్పులు చేసుకుంటే మీ బంగారు భవితకు బాటలు.. జీవితంలో ఆర్థికంగా స్థిరపడుతారు..
Vastu Tips Image Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 06, 2023 | 5:30 PM

Share
Vastu Shastra Tips: మనం పని చేసే ప్రదేశాన్ని బట్టే మన జీవనం, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం పని చేసే ప్రదేశం పరిశుభ్రంగా, గాలి వెలుతురు వచ్చేటట్టుగా ఉంటే మన శ్రద్ధ, ఏకాగ్రత పెరగటంతో పాటు పని సామర్థ్యం, సంపాదన కూడా పెరుగుతాయి. అందువల్ల మనం ఎక్కడ పని చేసినా పని వాతావరణం అనుకూలంగా ఉండవలసిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రం ఈ విషయంలో మనకు వీలైనంతగా సహాయపడుతుంది. మనం చేసేది చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే జీవితంలో ఆదాయపరంగా స్థిరపడటానికి, పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ 12 వాస్తు సూచనలు ఏంటో తెలుసుకోండి..
  1. వ్యాపారం ప్రారంభిస్తున్న ప్రదేశం దీర్ఘ చతురస్రాకారం గానో లేదా చతురస్రాకారంగానో ఉండటం చాలా మంచిది. ఆ ప్రదేశం సమతలంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దీనివల్ల తక్కువ కాలంలో లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది.
  2.  వ్యాపారం చేసే భవనం ఉత్తరానికి అభిముఖంగా ఉండటం ఉత్తమం. ఈశాన్యం వాయవ్యం కూడా మంచివే. ఈ దిశలకు అభిముఖంగా భవనం కానీ కార్యాలయం కానీ ఉండే పక్షంలో పాజిటివ్ ఎనర్జీ లోపలికి రావటానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ఒక రకంగా అదృష్టం అని చెప్పవచ్చు. ఇవి సంపద పెరగడానికి దోహదం చేస్తాయి.
  3. కార్యాలయ భవనం ప్రధాన ద్వారం తప్పనిసరిగా ఉత్తరం లేదా తూర్పు దిక్కుకు అభిముఖంగానే ఉండటం ప్రధానం. ఇది వ్యాపారం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందటానికి అవకాశం కల్పిస్తుంది.
  4. పనిచేసే ప్రదేశంలో ఈశాన్యం మూలలో మీ ఇష్ట దైవం ప్రతిమను ఉంచడం అవసరం. వ్యాపార ప్రదేశానికి సంబంధించి ఎన్ని దోషాలు ఉన్నా అవి పరిహారం అయిపోతాయి. ఈశాన్య మూ వీలైనంత పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ ప్రదేశం సువాసనలను విరజిమ్ముతు ఉండాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు లేదా ఇబ్బంది తూర్పు లేదా ఉత్తర దిక్కులకు ఎదురుగా కూర్చోవడం అవసరం. అంతేకాదు ఉద్యోగులు సరిగ్గా దీపం కింద కూర్చోకపోవడం మంచిది. తూర్పు ఉత్తర దిక్కులకు ఎదురుగా కూర్చోవడం వల్ల ఉద్యోగులలో శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.
  7. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి దినదినాభివృద్ధి చెందాలన్న పక్షంలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉత్తరం లేదా తూర్పు దిక్కుల్లో ఉండటం మంచిది.  అకౌంట్ పుస్తకాలను పెట్టే బీరువాలు నైరుతి, ఉత్తర దిశలకు అభిముఖంగా ఉండటం అవసరం. దీనివల్ల వ్యాపారం నిలకడగా ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది.
  8. ఇక అధికారులు గానీ, సిబ్బంది గానీ చతురస్రాకారపు బల్లలను ఉపయోగించడం మంచిది. పొరపాటున కూడా కోణాకారం లేదా వలయాకార బల్లలను ఉపయోగించకూడదు. వలయాకార బల్లలను ఉపయోగించినట్టయితే వ్యాపారం అప్పుల్లోనూ నష్టాల్లోనూ కూరుకు పోతుంది. ఎ టువంటి వ్యాపారానికైనా ఇది వర్తిస్తుంది.
  9. వ్యాపారంలో రంగులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముదురు రంగులు కాకుండా లేత రంగులు ఉపయోగించడం చాలా అవసరం. ముఖ్యంగా లేత గోధుమ రంగు, లేత పసుపు రంగు, తెలుపు రంగు వంటివి వ్యాపారం పెరగటానికి, నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ తాయి. నలుపు రంగు, ఎరుపు రంగు వాడటం వల్ల వ్యాపారంలో మధ్య మధ్య సమస్యలు చికాకులు ఎదురవుతుంటాయి.
  10. కార్యాలయంలోకి గాలి వెలుతురు ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిది. కార్యాలయంలో గానీ, కార్యాలయ భవనంలో కానీ చీకటి ఉండటం వ్యాపారానికి మంచిది కాదు. ఎక్కు వగా సహజమైన గాలికి వెలుతురుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కృత్రిమ గాలి, వెలుతురుల వల్ల వ్యాపారం దీర్ఘకాలంలో దెబ్బ తినటం జరుగుతుంది. అంతేకాదు, దీనివల్ల ఉద్యోగుల లోని శక్తి సామర్థ్యాలు త్వరగా రాణించవు.
  11. వ్యాపారంలో వేగంగా లాభాలు గడించాలన్నా, త్వరగా అభివృద్ధి చెందాలన్నా ప్రధాన కార్యాలయంలో ఈశాన్యం మూల ఒక ఎక్వేరియంను ఏర్పాటు చేయడం మంచిది. ఈశాన్యంలో నీటిని గనక ఉంచితే ఆ వ్యాపారం తప్పకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది.
  12. కార్యాలయ భవనంలో ఉత్తరం తూర్పు ఈశాన్యం దిక్కులో చెత్తాచెదారం,  విరిగిన వస్తువులు, స్టోర్ రూమ్ వంటివి ఉంటే వాటిని వెంటనే తొలగించడం వ్యాపారానికి చాలా మంచిది. ఈ దిక్కుల్లో దుమ్ము పేరుకుపోయి ఉండటం కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఈశాన్యం దిక్కు అతి పవిత్రంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.
  13. కార్యాలయ భవనం ప్రధాన ద్వారం ఆకర్షణీయంగా ఉండాల్సిన అవసరం ఉంది. తలుపు వేసేటప్పుడు, తీసేటప్పుడు శబ్దం కావటం మంచిది కాదు. ఈ ప్రధాన ద్వారాన్ని మంచి బొమ్మలతో లేదా చిత్తరువులతో కొద్దిగా అయినా అలంకరించడం మంచిది. ఈ తలుపులో పగుళ్లు ఉండటం వ్యాపారానికి శ్రేయస్కరం కాదు.
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..