Luck Astrology: ఉగాది తర్వాత జాక్ పాట్ కొట్టబోతున్న ఆ నాలుగు రాశులవారు.. అందులో మీరు కూడా ఉన్నారా?
జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, తుల, మకర రాశులను చర రాశులుగా పరిగణిస్తారు. ఈ చరరాశులు లగ్నాలైతే ఈ లగ్నాలలో జన్మించిన జాతకులు ఎక్కువగా తిరుగుతూనే ఉంటారు. వీరిలో మొబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఏ చిన్న యోగం పట్టినా పెద్ద ఫలితాలను ఇస్తూ ఉంటుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, తుల, మకర రాశులను చర రాశులుగా పరిగణిస్తారు. ఈ చరరాశులు లగ్నాలైతే ఈ లగ్నాలలో జన్మించిన జాతకులు ఎక్కువగా తిరుగుతూనే ఉంటారు. వీరిలో మొబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఏ చిన్న యోగం పట్టినా పెద్ద ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఉగాది తర్వాత నుంచి ఈ నాలుగు రాశుల వారికి కొన్ని రకాల అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి. విద్యా, ఉద్యోగం, విదేశీ యానం, వివాహం వంటి నాలుగు ప్రధాన అంశా లలో ఈ రాశుల వారి తలరాత అద్భుతంగా మారటం జరుగుతుంది.
మేష రాశి
జ్యోతిష శాస్త్ర పరంగా అత్యంత ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు, కుజుడు ఈ రాశి వారికి అనుకూలంగా మారినందువల్ల వీరు అనేక విధాలుగా ఒక సరికొత్త జీవితాన్ని అనుభవించ బోతున్నారు. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి అధికార యోగం పట్టబోతోంది. సంపద పెరగటం ఖాయం అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో కూడా అనూహ్యంగా రాణించడం జరుగుతుంది. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వీరి జీవితాలలో ఈ ఏడాది తప్పకుండా శుభ పరిణామాలు, శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. వీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచిది. ఈ రాశికి చెందిన విద్యార్థులు సైతం ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడం జరుగుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ప్రధానంగా గురువు శని కుజ గ్రహాలు విశేషమైన అదృష్టాలను కలిగిం చడం జరుగుతుంది. వీరు ఏ పని తల పెడితే ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది. విదేశాలకు వెళ్లడానికి, అక్కడ స్థిరపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఎటువంటి చదువు చదివినా మంచి ఉద్యోగం సంపాదించుకోవడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆస్తిపరుల కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి సంతానం కలుగుతుంది. వ్యాపార పరంగా కొత్త భాగస్వా ములతో పురోగతి చెందడం జరుగుతుంది. ఆహార విహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.
తులా రాశి
ఈ ఏడాది ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో పట్టపగ్గాలు ఉండవు. మంచి లాభాలతో పురోగతి చెందుతారు. సాంకేతిక రంగానికి చెందిన నిపుణులకు విదేశాలలో ఉద్యోగాలు సంపాదించి స్థిరపడే అదృష్టం పడుతుంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆశించిన స్థాయి జీత భత్యాలతో మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ప్రతిష్టాత్మక కంపెనీలలో ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం చేసినా సానుకూల ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది మొత్తం శని, రాహు, గురు, కుజ గ్రహాలు గతంలో ఎన్నడూ లేనంతగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి. వీరి సంపద లేదా ఆస్తుల విలువ అనేక రెట్లు పెరగబోతోంది. వృత్తి ఉద్యోగాలలో జీత భత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. జీవితం కొత్త మలుపులు జరుగుతుంది. ఉద్యోగపరంగా కొత్త ఆఫర్లు అంది వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవితం హ్యాపీగా గడవడానికి మార్గం సుగమం అవుతుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 23న గురు గ్రహం మేష రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం మేషరాశిలోకి ప్రవేశించే ముందు ఈ నాలుగు రాశుల వారు శివాలయానికి వెళ్లి అర్చన లేదా అభిషేకం చేయించడం వల్ల జీవిత పురోగతికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ తొలగిపోతాయి. విద్య ఉద్యోగం విదేశీయానం వివాహానికి సంబంధించి అదృష్ట యోగం లేదా రాజయోగం పట్టడానికి కూడా శివుని అనుగ్రహం తోడ్పడుతుంది.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..