AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Hanuman: ఆంజనేయునికి ఏయే పదార్ధాలతో అభిషేకాలు చేస్తే.. ఏయే ఫలితాలు కలుగుతాయంటే..!

Lord Hanuman: రామాయణంలో హనుమంతుడికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ రామ భక్తుడిగా... సీతా రాముల దాసునిగా.. భక్త రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులతో...

Lord Hanuman: ఆంజనేయునికి ఏయే పదార్ధాలతో అభిషేకాలు చేస్తే.. ఏయే ఫలితాలు కలుగుతాయంటే..!
Hanuman
Surya Kala
|

Updated on: Jun 01, 2021 | 1:41 PM

Share

Lord Hanuman: రామాయణంలో హనుమంతుడికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ రామ భక్తుడిగా… సీతా రాముల దాసునిగా.. భక్త రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులతో పూజలను అందుకుంటున్న దేవుడు. మనదేశంలో ఎక్కడ చూసినా అంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, .ఇలా అనేక పేర్లతో పూజలను అందుకుంటున్న హనుమాన్ కు ప్రీతి కరమైన రోజు మంగళవారం. ఈరోజు ఆంజనేయునికి ఏయే పదార్ధాలతో అభిషేకాలు చేస్తే.. ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..!

తేనె – తేజస్సువృధ్ధి చెందుతుంది ఆవుపాలతో – సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి. ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి చేకూరుతుంది. ఆవునెయ్యి -ఐశ్వర్యం విబూధితో – సర్వపాపాలు నశిస్తాయి పుష్పోదకం – భూలాభాన్ని కలుగజేస్తుంది బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి పంచదార – దు:ఖాలు నశిస్తాయి చెరకురసం – ధనం వృధ్ధి చెందుతుంది కొబ్బరినీళ్ళతో – సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి. గరికనీటితో – పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహనాదులను తిరిగి పొందగలుగుతారు. అన్నంతో అభిషేకంతో – సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది. నవరత్నజలాభిషేకం – ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది మామిడిపండ్లరసంతో – చర్మ వ్యాధులు నశిస్తాయి. పసుపునీటితో – సకలశుభాలు, సౌభాగ్యదాయకం నువ్వులనూనెతో అభిషేకిస్తే – అపమృత్యు నివారణ. సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం ద్రాక్షారసంతో – జయం కలుగుతుంది కస్తూరిజలాభిషేకంచేస్తే – చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.

Also Read: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?? ( వీడియో )

దైవ ప్రార్థనల వల్ల మంచి ఆలోచనలు.. అత్యవసర పనులకు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి..