Horoscope June: ఈ రాశి వారు ఈ నెల‌లో ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. జూన్‌లో మీ రాశిఫ‌లం ఎలా ఉందో చూసుకోండి..

Horoscope June: ఈ ఏడాది మ‌రో కొత్త నెల‌లో అడుగులు పెట్టాం. మ‌రెన్నో కొత్త అవ‌కాశాలను తీసుకొచ్చిందీ నెల‌. మ‌రి రాశి ఫ‌లాల ఆధారంగా ఈ నెల ఎలాంటి ఫ‌లితాలు క‌లిగే అవ‌కాశాలున్నాయి. ఎలాంటి విష‌యాల్లో...

Horoscope June: ఈ రాశి వారు ఈ నెల‌లో ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. జూన్‌లో మీ రాశిఫ‌లం ఎలా ఉందో చూసుకోండి..
Horoscope Today
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 01, 2021 | 8:29 AM

Horoscope June: ఈ ఏడాది మ‌రో కొత్త నెల‌లో అడుగులు పెట్టాం. మ‌రెన్నో కొత్త అవ‌కాశాలను తీసుకొచ్చిందీ నెల‌. మ‌రి రాశి ఫ‌లాల ఆధారంగా ఈ నెలలో ఎలాంటి ఫ‌లితాలు క‌లిగే అవ‌కాశాలున్నాయి. ఎలాంటి విష‌యాల్లో జాగ్రత్త‌లు తీసుకోవాలిలాంటి పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి:

ఈ రాశి వారు ఈనెలలో డ‌బ్బుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎవ‌రికీ డ‌బ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు న‌ష్ట పోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌న‌సరం ఉంది. ఎవ‌రితోనూ వాద‌న‌ల‌కు దిగ‌క‌పోవ‌డం ఉత్త‌మం. ఆక‌స్మిక ప్ర‌యాణాలు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఉద్యోగ, వివాహ ప్ర‌య‌త్నాల‌కు క‌లిసొచ్చే అంశ‌లా క‌నిపిస్తోంది. ఇంట్లో వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది.

వృష‌భ రాశి:

ఈ రాశి వారికి ఈ నెల మిశ్ర‌మ ఫ‌లితాలు గోచ‌రిస్తున్నాయి. ఈనెల వ్యాపారుల‌కు క‌లిసొచ్చేలా క‌నిపిస్తోంది. ఉద్యోగ నిర్వ‌హ‌ణ‌లో ప‌ని ఒత్తిడి పెరిగిన‌ప్ప‌టికీ ప‌ట్టుద‌ల‌తో ప‌నులను పూర్తి చేస్తారు. నిరుద్యోగుల‌కు ఈనెల‌లో ఉద్యోగావ‌కాశాలు ల‌భించే ఫ‌లితం క‌నిపిస్తోంది. కొన్ని ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఈ రాశివారికి సూచించ‌ద‌గ్గ అంశం. ఇక ఆధ్యాత్మిక చింతన పెరిగే అవ‌కాశాలున్నాయి.

మిధున రాశి:

మిధున రాశి వారికి ఈ నెల‌లో ప‌నులు కాస్త నెమ్మ‌దించిన‌ప్ప‌టికీ క‌ష్టంతో కొన్నింటినీ నెర‌వేర్చుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌ద‌గా గ‌డుపుతారు. ఈ రాశివారికి ఈనెల‌లో సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

క‌ర్కాట‌క రాశి:

క‌ర్కాటక రాశి వారికి ఈ నెల సానుకూల ఫ‌లితాల క‌నిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉద్యోగాల్లో మార్పులు క‌నిపించే అవ‌కాశం క‌నిపిస్తోంది. కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా గడుపుతారు. స‌మాజంలో మంచి ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి.

సింహ రాశి:

ఈ రాశి వారికి ఈనెల‌లో ఆర్థికంగా ఢోకా ఉండ‌దు. స‌మ‌యానికి చేతికి డ‌బ్బులు అందుతాయి. కొత్త వ‌స్తువులు కొనుగోలు చేసే అవ‌కాశాలున్నాయి. వ్యాపారులకు శుభ ఫ‌లితాలు గోచ‌రించే అవ‌కాశాలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మొత్తం మీద సింహ‌రాశి వారికి ఈ నెలంతా సంతోషంగా గ‌డిపే అవ‌కాశాలున్నాయి.

క‌న్య రాశి:

క‌న్య రాశి వారికి ఈ నెల వివాహ ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. ఉద్యోగుల‌కు పై అధికారుల నుంచి ఒత్తిడి అధిక‌మ‌వుతుంది. నిరుద్యోగులు మంచి ఫ‌లితాల కోసం మ‌రికొంత కాలం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొన్ని అప్పులు చేయ‌క తప్పేలా లేదు.

తులా రాశి:

ఈ రాశి వారు ఈనెల‌లో చాలా కాలంగా వాయిదా వేస్తున్న ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపార రంగంలో ఉన్న వారికి పురోగ‌తి క‌నిపించే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. బంధువుల‌తో విభేధాలు త‌లెత్తే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌సరం ఉంది.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. రాద‌నుకున్న డ‌బ్బు చేతికి అందుతుంది. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఇత‌ర ఆదాయ మార్గాల‌ను ఎంచుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఇందులో విజ‌య‌వంత‌మ‌వుతారు కూడా. రాజ‌కీయాల్లో ఉన్న వారికి ఈ నెల‌లో మంచి ఫ‌లితాలు గోచ‌రిస్తున్నాయి.

ధ‌న‌స్సు రాశి:

ఈ రాశి వారికి ఈనెల శ్ర‌మ మీద ప‌నులు పూర్త‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రియ‌ల్ ఎస్టేట్ చేసే వాళ్లకు శుభ ఫ‌లితాలు గోచ‌రిస్తున్నాయి. వృత్తి, వ్యాపారులు ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌సరం ఉంది. అయితే శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాన్నిఅందుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నావాటిని సుల‌భంగా అధిగ‌మిస్తారు. చేప‌ట్టిన ప‌నుల్లో బంధు మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి.

కుంభ రాశి:

ఈ రాశి వారు ఈనెల అప్పులు తీర్చే ప్ర‌య‌త్నం చేస్తారు. న్యాయ‌, పోలీస్‌, మిలిట‌రీ రంగంలో ఉన్న వారు ప్ర‌మోష‌న్లు పొందే అవ‌కాశం క‌నిపిస్తోంది. రెండో ఆదాయ మార్గ అన్వేష‌ణ‌లో స్నేహితులు స‌హాయ‌ప‌డ‌తారు. ఏలిన్నాటి శ‌ని ప్ర‌భావం ఉన్నా అనుకున్న ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. వ్యాపారుల‌కు కాస్త ప్ర‌తికూల ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి కాబ‌ట్టి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం ఉంది.

మీన రాశి:

మీన రాశి వారికి ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ఫ‌లించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేకుండా ఉంటుంది. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. అన‌వస‌రంగా ఇతరుల‌తో వివాదాల జోలికి పోకూడ‌దు. ఆస‌క్మిక ప్ర‌యాణాలు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే సూచ‌న‌లున్నాయి, అయితే ఖ‌ర్చులు అదే స్థాయిలో పెరుగుతాయి. ఖ‌ర్చుల‌ను అదుపులో ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

Also Read: Zodiac Sign: మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు ‘ఐ లవ్యూ’ అని ఎంత త్వరగా చెబుతారో ఆ వ్యక్తి ‘రాశి’ చెబుతుంది తెలుసా?

Leadership Qualities: మీ నాయకత్వ ప్రతిభ గురించి మీ రాశి చక్రం ఏం చెబుతుంది.. ఏ రాశివారు తమ సహచరులతో ఎలా ఉంటారు?

Telangana: తెలంగాణ రేషన్ కార్డుదారులకు స‌ర్కార్ గుడ్ న్యూస్.. వివ‌రాలు ఇలా ఉన్నాయి

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?