AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Sign: మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు ‘ఐ లవ్యూ’ అని ఎంత త్వరగా చెబుతారో ఆ వ్యక్తి ‘రాశి’ చెబుతుంది తెలుసా?

Zodiac Sign: ప్రేమను వ్యక్తీకరించడం అంత సులువు కాదు. యువతీయువకుల మధ్యలో ప్రేమ ఎవరిలో చిగురించినా దానిని అవతల వారికి చెప్పడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి.

Zodiac Sign: మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు 'ఐ లవ్యూ' అని ఎంత త్వరగా చెబుతారో ఆ వ్యక్తి 'రాశి' చెబుతుంది తెలుసా?
Zordiac Sign
KVD Varma
|

Updated on: May 30, 2021 | 1:31 PM

Share

Zodiac Sign: ప్రేమను వ్యక్తీకరించడం అంత సులువు కాదు. యువతీయువకుల మధ్యలో ప్రేమ ఎవరిలో చిగురించినా దానిని అవతల వారికి చెప్పడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు తామెంతగా తమ స్నేహితుడిని ఇష్టపడుతున్నప్పటికీ, ఆ ఇష్టాన్ని చెప్పడానికి వెనుకాడుతారు. పైగా అతనే తనకు ముందుగా ఐలవ్యూ చెప్పాలని అనుకుంటారు. కానీ, అబ్బాయిలూ అంత త్వరగా బయటపడరు. వారూ చాలా ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని చెప్పడానికి దానికి చాలా కారణాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే.. వారి రాశులను బట్టి వారి ప్రేమను వ్యక్తీకరించడంలో తేడాలు ఉంటాయి. కొన్ని రాశుల వారు వెంటనే చెప్పేస్తారు. కొన్ని రాశుల వారిలో ఇది ఆలస్యం కావచ్చు. కొన్ని రాశుల వారు తమ మనసులోని మాట చెప్పడానికి ఎప్పుడూ సంకోచిస్తూనే ఉండిపోతారు. మరి ఏ రాశుల వారు ఏవిధంగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం.

మేషం

మేష రాశి వారు ఈ విషయంలో యమ స్పీడు. ఈ రాశి వారు డేటింగ్ ప్రారంభించిన వెంటనే అవతల వారికి విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం ఆలస్యం కాదు. అయితే, కచ్చితంగా మీరు ఊహించని సమయంలో అతను మీకు ఐ లవ్యూ చెబుతాడు. సర్ప్రైస్ కోరుకునే ఈ రాశివారి లక్షణం వల్ల ఇలా జరుగుతుంది.

వృషభం

వృషభ రాశి వారు మేష రాశివారికి భిన్నంగా ప్రేమ విషయంలో వ్యవహరిస్తారు. తన మనసులో మాట చెప్పడానికి చాలా సమయం తీసుకుంటారు. అతను మీరు కోరుకున్న ఉత్తమ భాగస్వామి కావచ్చు. ఎందుకంటే అతను స్థిరమైన మరియు నిబద్ధత గల జీవితానికి ప్రాధాన్యత ఇస్తాడు. చెప్పడం ఆలస్యం కావచ్చు కానీ, పక్కాగా చెబుతారు. అంతే చక్కగా బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి తాను మీ వద్ద బయట పడటానికి సంవత్సర కాలం కంటె ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ రాశివారిని మీరు ప్రేమిస్తే.. అతని నుంచి ఐ లవ్యూ కోరుకోకండి.. మీరే ముందు చెప్పేయండి.

మిధునం

ఈ రాశి వారు సీతాకోకచిలుకల్లాంటి వారు. స్నేహితులను సంపాదించుకుంటారు. వీరు అన్ని విషయాలు బేరీజు వేసుకుంటే కానీ, ప్రేమ విషయంలో ముందడుగు వేయరు. మీలోని ప్రతి విషయాన్నీ వారు పరిశీలిస్తారు. మీ అంతరంగాన్ని పూర్తిగా శల్య పరీక్ష చేసి.. మీరు అతని విషయంలో నూటికి నూరుపాళ్ళూ నిజాయతీగా ఉన్నారని నమ్మితేనే మీ ముందు బయట పడతారు. దానికి ఎంతకాలమైన పట్టవచ్చు. ఒకవేళ మీరు తొందరపడి ప్రాజ్ చేసినా దానిపై తన అభిప్రాయం చెప్పడానికీ చాలా ఆలోచిస్తారు.

కర్కాటకం

వారు భావోద్వేగాలకు సంబంధించి చాలా సున్నితమైన సెంటిమెంట్ కలిగి ఉంటారు. కాబట్టి, ఈ రాశి వారు మీరు ఊహించిన దానికన్నా తొందరగానే మీకు ప్రపోజ్ చేసేస్తారు. వీరు చాలా త్వరగా ప్రేమకు కనెక్ట్ అయిపోతారు. వీరు ప్రేమించిన వారి పట్ల చాలా సున్నిత బంధాన్ని కోరుకుంటారు. అందువల్ల ఈ రాశివారిని ప్రేమిస్తే మీకు సౌకర్యవంతమైన సురక్షితమైన జీవితం దొరికినట్టే.

సింహం

ఈ రాశి వారు కూడా ఎక్కువ వేచి చూడరు. అతను మీరు తనతో సాధ్యమైనంత వేగంగా నిబద్ధతతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటాడు. అతను ప్రేమ, ఓదార్పు, ముఖ్యంగా, శ్రద్ధ మీ నుండి కోరుకుంటాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు ఐలవ్యూ చెప్పాలని చూస్తాడు. సాధారణంగా వారం లోపే మీకు తన నిర్ణయం చెప్పేస్తాడు.

కన్య

ఈ రాశివారికి ఐలవ్యూ చెప్పడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం కావాలి. మీకు మాయ మాటలు చెప్పడం వంటి వాటిని ఇష్టపడరు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని విషయాలు మీకు చెప్పిన తరువాత తన ప్రపోజల్ మీ ముందు ఉంచుతారు.

తుల

తులా రాశి వారు మీపై తన ప్రేమను ఒక వారంలో చెప్పేస్తారు. ఒకవేళ చెప్పకపోతే తరువాత ఎప్పుడు చేబుతారనేది ఎవరూ చెప్పలేరు. చాలా సమయం దానికోసం తీసుకుంటారు. మీరు అతనితో ప్రేమలో పడటానికి అతను అన్ని వ్యూహాలను ప్రయత్నిస్తాడు, కానీ మీ పట్ల అతని భావాలను గుర్తించడానికి అతనికి చాలా సమయం పడుతుంది. అతను మీకు మంచి అనుభూతినిచ్చేలా బహుమతులు మరియు అభినందనలు ఇస్తాడు.

వృశ్చికం

ఈ రాశి వారు మీకు తాను మీకోసం ఎంత కష్టపడుతున్నాడనే దాని గురించి చిన్న చిన్న సూచనలు ఇస్తాడు. తన ప్రేమను వెల్లడించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు దానిని గమనించి అతనికి ఆ అవకాశం ఇవ్వాలి. మీరు అవకాశం ఇచ్చే వరకూ అతను తన మనసులోని భావాలను నేరుగా మీకు చెప్పడు.

ధనుస్సు

ఈ రాశి వారు మీరంటే ఎంత ఇష్టమో చెప్పడానికి వారు సిగ్గుపడరు. ధనుస్సు పురుషులు తమ ప్రేమను మీతో చెప్పుకోవటానికి ఎవరు పక్కన ఉన్నా పట్టించుకోరు. నేను ప్రేమిస్తున్నాను అని మీకు చెప్పాలి అనిపిస్తే దానికి సమయం సందర్భం కూడా చూసుకోరు నిస్సిగ్గుగా మీతో ఆ విషయాన్ని సూటిగా చెప్పేస్తారు.

మకరం

మకర రాశి వారికీ ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మీకు చెప్పడానికి సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పడుతుంది. మీ మకర రాశి వ్యక్తితొ డేటింగ్ దశలో స్థిరపడటానికి కొంత సమయం కావాలి. అత్యంత విలువైన పదాలను చెప్పే ముందు మిమ్మల్ని మరింత తెలుసుకోవాలి అనుకుంటాడు. అతను ఆ మాటలను సాధారణంగా చెప్పలేడు.

కుంభం

వారి పట్ల మీ ఉద్దేశాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి వారు బహుశా వేచి ఉన్నారు. అక్వేరియన్లు తమ భాగస్వామిని ప్రేమించాలని చాలా లోతైన కోరిక కలిగి ఉంటారు. కాబట్టి వారు మిమ్మల్ని బాధించే పనులను చాలా అరుదుగా చేస్తారు. బంగారు పదాలను మీకు చెప్పడానికి వారికి మూడు నుండి ఆరు నెలల సమయం పడుతుంది. అవి మిమ్మల్ని విడిచిపెట్టినట్లు అనిపించవచ్చు. కానీ అలా అనుకోకండి, ఎందుకంటే ఇది నెమ్మదిగా బలంగా ప్రేమలో పడే మార్గం.

మీనం

అతని భావాలను గుర్తించడానికి మరియు చెప్పడానికి వారికి చాలా సమయం పడుతుంది, బహుశా ఒక సంవత్సరం, ఎందుకంటే ప్రేమ విషయానికి వస్తే మీన రాశి వారు చాలా సిగ్గుపడతారు. భావోద్వేగాలను వ్యక్తీకరించడం కంటే భావించడం చాలా ముఖ్యమైనదని వారు భావిస్తారు, కాబట్టి వారు మీకు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ఇంకా చెప్పకపోతే నిరాశ చెందకండి. కొద్దిగా ఆలస్యంగా వారు తమ ప్రేమను వ్యక్త పరుస్తారు.

Also Read: Zodiac Sign: ఈ మూడు రాశుల వారు తమ భాగస్వాములకు చాలా నమ్మకమైనవారు..నిజాయితీపరులు

Leadership Qualities: మీ నాయకత్వ ప్రతిభ గురించి మీ రాశి చక్రం ఏం చెబుతుంది.. ఏ రాశివారు తమ సహచరులతో ఎలా ఉంటారు?