Trains Cancel: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 28 రైళ్లు రద్దు.. సర్క్యూలర్ జారీ.. ఏయే ట్రైన్లు అంటే..?

South Central Railway: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు జంకుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే

Trains Cancel: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 28 రైళ్లు రద్దు.. సర్క్యూలర్ జారీ.. ఏయే ట్రైన్లు అంటే..?
Trains Cancels
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 30, 2021 | 2:57 PM

South Central Railway: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు జంకుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో 24 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరో నాలుగింటిని పాక్షికంగా వివిధ స్టేషన్ల మధ్య రద్దు చేసినట్లు వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల పెరుగుతుండటం, అదేవిధంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ తరహా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండడంతో ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సరైన ఆక్సుపెన్సీ లేకపోవడంతో రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా రద్దయిన రైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

పూర్తిగా రద్దయిన రైళ్లు.. రైలు నం. 02707 విశాఖపట్నం – తిరుపతి రైలు జూన్ 3-14వ తేదీ వరకు రద్దు. 02708 తిరుపతి – విశాఖపట్నం ట్రైన్‌ జూన్ 2 – 13 వరకు రద్దు. 02735 సికింద్రాబాద్ – యశ్వంతపూర్ ట్రైన్ జూన్ 2 – 13 వరకు రద్దు. 02736 యశ్వంతపూర్ – సికింద్రాబాద్ ట్రైన్ జూన్ 3 – 14 వరకు రద్దు. 02795 విజయవాడ – లింగంపల్లి ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు. 02796 లింగంపల్లి – విజయవాడ ట్రైన్ జూన్ 2 – 16 వరకు రద్దు. 06203 చెన్నై సెంట్రల్ – తిరుపతి ట్రైన్ ను జూన్ 1 – 15 వరకు రద్దు. 06204 తిరుపతి – చెన్నై సెంట్రల్ ట్రైన్ జూన్ 1 – జూన్ 15 వరకు రద్దు. 07001 షిర్డీ సాయినగర్ – సికింద్రాబాద్ వరకు స్పెషల్ ట్రైన్ జూన్ 5 – 14 వరకు రద్దు. 07002 సికింద్రాబాద్ – షిర్డీ సాయినగర్ స్పెషల్ ట్రైన్ జూన్ 4 – 13 వరకు రద్దు. 07003 విజయవాడ – షిర్డీ సాయినగర్ ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు. 07002 షిర్డీ సాయినగర్- విజయవాడ ట్రైన్ జూన్ 2 – 16వ తేదీ వరకు రద్దు. 07407 తిరుపతి – మన్నార్ గుడి ట్రైన్ జూన్ 2 – 13 వరకు రద్దు. 07408 మన్నార్ గుడి – తిరుపతి ట్రైన్ జూన్ 2 – 14 వరకు రద్దు. 07625 కాచిగూడ – రేపల్లె ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు. 07626 రేపల్లె – కాచిగూడ ట్రైన్ జూన్ 2 – 16 వరకు రద్దు. 07249 కాకినాడ టౌన్ – రేణిగుంట ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు. 07250 రేణిగుంట – కాకినాడ ట్రైన్ జూన్‌ 2 – 16 వరకు రద్దు. 07237 బిత్రకుంట – చెన్నై సెంట్రల్‌ ట్రైన్‌ జూన్‌ 1-15 వరకు రద్దు. 07238 చెన్నై సెంట్రల్‌ – బిత్రకుంట ట్రైన్‌ జూన్‌ 2-15 వరకు రద్దు. 07619 నాందేడ్‌ – ఔరంగాబాద్‌ ట్రైన్‌ జూన్‌ 4-11 వరకు రద్దు. 07620 ఔరంగాబాద్‌ – నాందేడ్‌ ట్రైన్‌ జూన్‌ 7-14 వరకు రద్దు. 07621 ఔరంగాబాద్‌ – రేణిగుంట ట్రైన్‌ జూన్‌ 4 -11 వరకు రద్దు. 07622 రేణిగుంట – ఔరంగాబాద్‌ ట్రైన్‌ జూన్‌ 5-12 వరకు రద్దు.

పాక్షికంగా రద్దయిన ట్రైన్లు రైలు నం. 07691 నాందేడ్‌ – తాండూర్‌ ట్రైన్‌.. సికింద్రాబాద్‌-తాండూర్‌ మధ్య జూన్‌ 1-15 మధ్య రద్దు. 07692 తాండూర్‌ – పర్భణి ట్రైన్‌.. తాండూరు నుంచి సికింద్రాబాద్‌.. నాందేడ్‌ నుంచి పర్బని వరకు జూన్‌ 2-16 వరకు రద్దు. 07491/07420 తిరుపతి / హైదరాబాద్‌ వాస్కోడగామా ట్రైన్‌ను హుబ్లి వాస్కోడిగామ మధ్య జూన్‌ 3-10 వరకు రద్దు. 07420/0722 వాస్కోడిగామా-తిరుపతి/హైదరాబాద్‌ ట్రైన్‌ను వాస్కోడగామా – హుబ్లి జూన్‌ 4-11 రద్దు చేశారు.

Also Read:

ప్రధాని మోదీ ఓ ‘ఈవెంట్ మేనేజర్’…, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, … ‘మన్ కీ బాత్’ అర్థ రహితమని విమర్శ

Coronavirus: ఒకే వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌… రక్తం విషపూరితం.. మృతి