Hooch Tragedy: 25కు పెరిగిన కల్తీ మద్యం మరణాలు.. ఇంకా విషమంగానే పలువురి పరిస్థితి..
Aligarh hooch tragedy: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 25కు పెరిగింది. అలీగఢ్ ప్రాంతంలోని కర్సియాలోని ఓ లైసెన్స్‌డ్
Aligarh hooch tragedy: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 25కు పెరిగింది. అలీగఢ్ ప్రాంతంలోని కర్సియాలోని ఓ లైసెన్స్‌డ్ దుకాణం నుంచి వీరంతా మద్యం విక్రయించి తాగారు. కాగా.. శుక్రవారం సాయంత్రానికి 15 మంది మృతిచెందగా.. ఆదివారం మధ్యాహ్నానికి ఈ సంఖ్య 25కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నానికి చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఆదివారం మధ్యాహ్నానికి మరో ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25 కి పెరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం మరో 26 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. అలీగఢ్‌లోని లోధా, ఖైర్, జవాన్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం చాలా మంది కల్తీ మద్యం తాగారు. దీంతో ఆయా గ్రామాల్లో మొత్తం 51 మంది పరిస్థితి విషమించగా అందులో 25 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 12 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కల్తీ మద్యానికి సంబంధించి ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ.. ఎక్సైజ్ విభాగం అడిషనల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కాన్‌స్టేబుల్‌లను విధుల నుంచి తొలగించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: